Priya Bhavani Shankar: ఈ ఏడాది ‘ఇరుముడి’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజ కి మంచి బూస్ట్ ని ఇచ్చిన చిత్రమిది. ఇక ఈ చిత్రం ద్వారా మన ఇండస్ట్రీ కి పరిచయమైనా ప్రియా భవాని శంకర్ కి కూడా మంచి పేరొచ్చింది. ఇకపై తెలుగు లో కూడా ఈమెకు అవకాశాలు క్యూలు కట్టొచ్చు. ఇదంతా పక్కన పెడితే నేడు ఆమె తన ప్రియుడు రాజ్ వేల్ రాజ్ తో వివాహబంధం లోకి అడుగుపెట్టారు. సుమారుగా 10 ఏళ్ళ నుండి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోంది. ఇంట్లో పెద్దలు కూడా వీళ్ళ పెళ్ళికి అంగీకారం తెలపడం తో కాసేపటి క్రితమే వీళ్లిద్దరి బంధు మిత్రుల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
శంకర్ రాజ్ తాళి కడుతున్న సమయం లో ప్రియా ముఖం లోని ఆనందాన్ని చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఆమె నవ్వు లో శంకర్ పై ఇష్టాన్ని తెలియజేస్తోంది. కచ్చితంగా ఈ జంట రాబోయే రోజుల్లో సౌత్ లోనే మోస్ట్ లవ్లీ కపుల్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఒక సాధారణ యాంకర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ప్రియా భవాని శంకర్, నేడు తమిళ ఇండస్ట్రీ లోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చలామణి అవుతోంది. ఎన్నో ఏళ్ళ నుండి తమిళం లో ఆమె సినిమాలు చేస్తున్నప్పటికీ , కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం మన తెలుగు సినిమానే. మన తెలుగు లోకి ‘ఇరుముడి’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈమె కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలు కొనసాగిస్తుందా , లేదా అనేది తెలియాల్సి ఉంది.