Homeఎంటర్టైన్మెంట్Ballaya Heroine: ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకొమ్మన్నారు... బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్

Ballaya Heroine: ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీలు చేయించుకొమ్మన్నారు… బాలయ్య హీరోయిన్ సంచలన కామెంట్స్

Ballaya Heroine: బాలీవుడ్ లో రాధికా ఆప్టే వివాదాస్పద హీరోయిన్ గా ఉన్నారు. కెరీర్ బిగినింగ్ నుండి అనేక వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఏకంగా న్యూడ్ గా నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ గా కూడా పేరున్న రాధికా ఆప్టేకు ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, మనిషా కొయిరాలా కూడా నటించారు. కాగా రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో రాధికా ఆప్టే కెరీర్ బిగినింగ్ లో ఎదురైన కొన్ని చేదు అనుభవాలు వెల్లడించారు.

Ballaya Heroine
Radhika Apte

పరిశ్రమకు వచ్చిన కొత్తలో రాధికా కొన్ని రకాల వింత ప్రశ్నలు, సలహాలు ఎదుర్కొన్నారట. ఆఫర్స్ కోసం పాల్గొన్న కొన్ని మీటింగ్స్ లో అందం కోసం శరీరంలో కొన్ని భాగాలు మార్చుకోవాలని కొందరు సలహాలు ఇచ్చారు. ఫస్ట్ మీటింగ్ లో నీ ముక్కు సరిగా లేదు సర్జరీ చేయించుకో అన్నారట. తర్వాత మరొక మీటింగ్ లో మీకు సరిపడా వక్షోజాలు లేవు, వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో అన్నారట. అలా మరో మీటింగ్ లో ఒకరు బటక్స్, ఇంకొకరు బుగ్గలు, ఇంకొందరు కాళ్ళు… ఇలా పలువురు తన శరీరంలోని కొన్ని భాగాలను సర్జరీతో అందంగా మార్చుకోమని సలహా ఇచ్చారట.

Also Read: Vikram Second Week Collections: రూ. 300 కోట్ల దిశగా విక్రమ్… రెండో వారం కూడా తగ్గని కమల్ జోరు!

వాళ్ళ సలహాలు ఆమెకు కోపం తెప్పించాయట. కృత్రిమ అందం అంటే నాకు ఇష్టం ఉండదు. నా జుట్టుకు రంగు వేసుకోవడానికే నేను చాలా ఏళ్ళు ఆలోచించాను. అయితే అలాంటి సలహాలు నన్ను మరింత దృఢంగా మార్చాయి. నా శరీరాన్ని నేను మరింతగా ప్రేమించేలా చేశాయని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. అందం కోసం నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు అన్నారు. రాధికా ఆప్టే లేటెస్ట్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Ballaya Heroine
Radhika Apte

తెలుగులో రాధికా లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లో నటించారు. 2014లో విడుదలైన ఆ చిత్రంలో రాధికా ఓ హీరోయిన్ గా నటించారు. అలాగే బాలకృష్ణ మరొక చిత్రం లయన్ లో నటించడం జరిగింది. ధోని, రక్త చరిత్ర రెండు భాగాల్లో రాధికా నటించడం విశేషం. బాలీవుడ్ లో ఎక్కువ చిత్రాలు చేసిన రాధికా.. ప్రస్తుతం మరో రెండు హిందీ చిత్రాలు చేస్తున్నారు. వాటిలో హ్రితిక్ రోషన్ విక్రమ్ వేద ఒకటి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది విక్రమ్ వేద తమిళ్ రీమేక్ కావడం విశేషం.

Also Read: Hero Nani: పోలీసులను దారుణంగా మోసం చేసిన హీరో నానీ
Recommended Videos
Ante Sundaraniki 3rd Day Box office Collections || Nani || Oktelugu Entertainment
పోలీసులను మోసం చేసిన హీరో నానీ || Hero Nani Cheated Police || Ante Sundaraniki Movie
4వ పెళ్ళికి సిద్ధం అయిన సీనియర్ నటుడు నరేష్ || Senior Actor Naresh Ready For 4th Marriage

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version