F3 Movie Team: విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలు గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన F3 సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..నాలుగేళ్ల క్రితం విడుదల అయిన F2 సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై మొదటి నుండి అటు ట్రేడ్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉండేవి..ఆ అంచనాలను అందుకోవడం లో ఈ సినిమా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ ప్రేక్షకులను ఎక్కువగా నవ్వించింది..త్వరలో F4 కూడా ఉంటుంది అని ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికే 55 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికి డీసెంట్ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క క్రేజీ ఆఫర్ ని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవలే రిజెక్ట్ చేసినట్టు సమాచారం.

Also Read: Hero Nani: పోలీసులను దారుణంగా మోసం చేసిన హీరో నానీ
అదేమిటి అంటే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ సంస్థ కి 8 కోట్ల రూపాయలకు అమ్మాడు దిల్ రాజు..అయితే 8 వారాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే OTT లో విడుదల చేసుకునేందుకు డీల్ చేసుకున్నాడు..ఇప్పుడు నాలుగు వారాలు ముందు విడుదల చేసుకునే అనుమతిని ఇస్తే 12 కోట్ల రూపాయిలు ఇస్తాము అని ముందుకి వచ్చారట..కానీ ఈ ఆఫర్ కి దిల్ రాజు ఒప్పుకోలేదట..సినిమాకి ఇంకా మంచి రన్ ఉన్నది అని..వీకెండ్స్ వస్తే థియేటర్స్ అన్ని ఫామిలీస్ తో నిండిపోతున్నాయి అని..అలాంటి సినిమాని ముందస్తుగా OTT కి ఇస్తే మాకు చాలా నష్టం అని దిల్ రాజు ఈ క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం..ఇప్పటికే 55 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలి అంటే 10 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి..కానీ అంత మొత్తం ఈ సినిమా వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి..ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట ఏమిటి అంటే..ఈ సినిమా మీద కొత్త సినిమాల ప్రభావం గట్టిగా పడింది అని..లేకపోతే అతి తేలికగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునేది అని అంటున్నారు.

Also Read: Central Government New Portal: కేంద్ర ప్రభుత్వం కొత్త పోర్టల్.. ఇక ఈజీగా ఆన్‌లైన్ లోన్..
[…] […]