Prithviraj Sukumaran comments on Prabhas
Prabhas : ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద హీరో. వందల కోట్ల మార్కెట్ ఆయన సొంతం. వివిధ పరిశ్రమల్లో ఫేమ్ ఉంది. ప్రభాస్ మృదు స్వభావి. వివాదరహితుడు. తన పనేదో తాను చూసుకుంటూ, మీడియా దృష్టికి దూరంగా ఉంటాడు. రిజర్వ్డ్ గా ఉంటారు. భోజన ప్రియుడైన ప్రభాస్.. మూవీ సెట్స్ లో ప్రతి ఒక్కరు మంచి భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తాడు. ఇక తనతో నటించే హీరోయిన్, ప్రధాన తారాగణంకి అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం సాంప్రదాయంగా పాటిస్తాడు.
లేటెస్ట్ మూవీ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వికి సైతం ప్రభాస్ భారీ ట్రీట్ ఇచ్చాడు. ప్రభాస్ తినిపించిన వంటకాలకు సంబంధించిన ఫోటోను ఇమాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా సలార్ మూవీలో ప్రభాస్ మిత్రుడిగా మలయాళ హీరో పృథ్విరాజ్ నటించాడు. ఆయన ప్రభాస్ ఆతిధ్యాన్ని ఉద్దేశిస్తూ.. ఫిట్నెస్ గోవిందా, అని కామెంట్ చేశాడు. తాజాగా పృథ్విరాజ్.. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు షేర్ చేశాడు.
ప్రభాస్ పెద్ద స్టార్ అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటాడు. ఆయన సోషల్ మీడియా వాడడు. అసలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్స్ కూడా ప్రభాస్ పెట్టరు. ఆయన పేరిట మరొకరు పెడతారు. ఈ మాట చెప్పి బాధ పెడుతున్నందుకు క్షమించండి. ప్రభాస్ ఎప్పుడూ ప్రశాంతంగా ఫార్మ్ హౌస్లో ఉండాలి అనుకుంటారు. అసలు మొబైల్ లేని ప్రదేశానికి వెళ్లి హాయిగా గడపాలి అని భావిస్తారు. ప్రభాస్ చిన్న చిన్న ఆనందాలు చూస్తే ఆశ్చర్యం, వేస్తుంది అన్నారు.
ప్రభాస్ ఇంస్టాగ్రామ్ ని 13 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతారు. అసలు ప్రభాస్ ఇంస్టాగ్రామ్ వాడరు. పీఆర్ లు నిర్వహిస్తారని పృథ్విరాజ్ ఓపెన్ గా చెప్పేశాడు. ఇది అభిమానులకు షాకింగ్ న్యూస్ అనడంలో సందేహం లేదు. స్టార్ హీరోలను కలవడం కుదరదు కాబట్టి.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తారని భావిస్తారు. ప్రభాస్ కి ఫోన్ వాడటం ఇష్టం ఉండదు. సోషల్ మీడియా అకౌంట్స్ ని నిర్వహించరు అంటే అర్థం, అభిమానుల కామెంట్స్ ఆయన చదవరు.
ఆ విషయం అటుంచితే.. ప్రభాస్ కల్కి తో భారీ విజయం నమోదు చేశాడు. ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజి చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది.
Web Title: Prithviraj sukumarans latest comments are disappointing for prabhas fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com