https://oktelugu.com/

Prithviraj Sukumaran: ఆ క్యారెక్టర్ కోసం 31 కేజీలు తగ్గి తన డెడికేషన్ ఏంటో చూపించిన స్టార్ హీరో…

మొత్తానికైతే సలార్ సినిమాతో పృధ్విరాజ్ సుకుమారన్ పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ 'ఆడు జీవితం' సినిమాతో మరొకసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన ఈ సినిమా మీదే చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 08:27 AM IST

    Prithviraj Sukumaran

    Follow us on

    Prithviraj Sukumaran: సినిమా ఇండస్ట్రీ కొంతమంది ఒక పాత్ర కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్లు ఆ పాత్రలో లీనమైపోయి నటిస్తూ ఉంటారు. వాళ్ల హావ భావాలు గాని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ పాత్రకి అనుకూలంగా ఉండే విధంగా మలుచుకుంటు ఉంటారు. అందుకే వాళ్ళు చూపించే నటనలోచాలా వైవిధ్యమైతే కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీకి చెందిన విక్రమ్ ఇలాంటి చాలెంజింగ్ క్యారెక్టర్స్ ని తీసుకొని తనని తాను ఆ క్యారెక్టర్ లోకి మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

    ఇక ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా అదే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన ‘ఆడు జీవితం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 28వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాలో ఆయన ‘నజీబ్ ‘ అనే ఒక బానిస పాత్రలో నటించబోతున్నాడు. అయితే దానికోసం ఆయన 31 కేజీల బరువు తగ్గాల్సి వచ్చిందట. బానిస అంటే తిని తినకుండా ఉంటాడు కాబట్టి ఆ క్యారెక్టర్ లో వీక్ గా కనిపించాలి. అందుకే ఆ పాత్ర అనేది చాలా ఛాలెంజింగ్ తో చేయాలి.

    అలాంటప్పుడే ఆ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశ్యం తో ఆయన జిమ్ ట్రైనర్, డాక్టర్ల పర్యవేక్షణతో 31 కేజీల బరువు తగ్గి ఆ పాత్రకి ప్రాణం పోశాడనే చెప్పాలి…ఇక ఈ సినిమా జోర్డాన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు కరోనా లాక్ డౌన్ విధించడంతో అప్పుడు చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారట. ఇక ఈ సినిమాని ‘ది గోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లీషులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే సలార్ సినిమాతో పృధ్విరాజ్ సుకుమారన్ పాన్ ఇండియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ‘ఆడు జీవితం’ సినిమాతో మరొకసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన ఈ సినిమా మీదే చాలా ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది….