Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 నేటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ తో కొత్త గేమ్ ఆడించారు. హౌస్ మేట్ గా ఎవరు పాస్ .. ఎవరు ఫెయిల్ అయ్యారో చెప్పాలని కోరారు. దీంతో దాదాపు హౌస్ మేట్స్ చాలా వరకు రతిక పేరు చెప్పారు. ప్రియాంక, శోభా ఇద్దరూ కలిసి ఎప్పటిలానే రతిక పై పడ్డారు. రతిక దగ్గరనుంచి ఎక్కడా ఎఫర్ట్స్ కనిపించట్లేదు గేమ్స్ లో అని శోభ చెప్పింది. అమర్ చేస్తే ఓకే .. రతిక చేస్తే వేరా అంటూ నాగార్జున ఇచ్చి పడేశాడు.
తర్వాత గౌతమ్… ‘రతిక అందరి గేమ్ చూసి వచ్చింది .. తనకి అడ్వాంటేజ్ ఎక్కువ’ అని చెప్పాడు. ఇక అర్జున్ తనకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు గేమ్ లో అని చెప్పాడు గౌతమ్. ఆ తర్వాత అర్జున్ అమర్ పేరు ఫెయిల్ అని రాసాడు. ‘ వాడు వాడి కోసం గేమ్ ఆడితే కచ్చితంగా గెలుస్తాడు, పక్కోడు ఓడిపోవాలని ఆడితే మాత్రం గెలవడు అని అర్జున్ చెప్పాడు. అమర్ దీప్ కూడా రతిక ఫెయిల్ అని చెప్తూ, భయం పక్కన పెట్టాలి అని అన్నాడు.
ఆ తర్వాత శోభా శెట్టి నామినేషన్స్ లో పక్షపాతంగా వ్యవహరించిందని నాకు అనిపించింది అని యావర్ చెప్పాడు. ఇక రతిక హౌస్ మేట్ గా శోభా ఫెయిల్ అయింది అని చెప్పింది. తర్వాత ప్రశాంత్ ఏ గేమ్ లో అయినా ఉరుకుతున్నాడు. హౌస్ మేట్ గా ప్రశాంత్ పాస్ అని రాశాడు భోలే.
చివర్లో అర్జున్ ‘ భోలే హౌస్ లో కి వచ్చినప్పటికీ .. ఇప్పటికీ చాలా మార్పు చూశాను ‘ అంటూ భోలే ని పొగిడేశాడు. ఇక హోస్ట్ నాగార్జున మనం దేని గురించైనా మాట్లాడుకోవాలా అని ఇంటి సభ్యులను అడిగారు. దీంతో రతిక లేచి నిలబడింది. బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ ప్రోమోలో ఇలాంటి ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు ఎలిమినేషన్ టెన్షన్ వెంటాడుతుంది. శివాజీ, యావర్, గౌతమ్, భోలే, రతిక నామినేషన్స్ లో ఉన్నారు భోలే ఎలిమినేట్ అయినట్లు సమాచారం.