SC Classification: దళితుల్లో ఒకవర్గం ఆధిపత్యంతో మిగత పది ఉపకులాలకు ఏళ్లుగా జరుగుతున్న అన్యాయంపై దండోరా మోగించాడు మంద కృష్ణ మాదిగ. 1994, జూలై 7న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాం మొదలు పెట్టారు. వరంగల్ జిల్లా శాయంపేటలో 1965లో పుట్టిన మంద కృష్ణ.. 30 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. కానీ, ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్న పార్టీలు గెలిచిన తర్వాత ఆ నెపాన్ని కేంద్రంపై వేసి చేతులు దులుపుకుంటున్నాయి.
సామాజిక కార్యకర్తగా..
సామాజిక కార్యకర్తగా జీవితం ప్రారంభించిన మంద కృష్ణ.. మాదిగ సామాజికవర్గ కోసం పోరాటం మొదలు పెట్టారు. 14 మంది యువకులతో దండోరా పోరాటం మొదలు పెట్టారు. ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) కృషి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎసీ‍్స రిజర్వేషన్స్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గం అనుభావిస్తుందని మిగతా సామాజిక వర్గాలైన మాదిగ మాదిగ ఉప కులాలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక సామజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 50 ఏండ్ల అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగ కులం చెప్తూ అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కావాలంటూ పోరాటం షురూ చేశారు.
వెనుకబడిన వారికి న్యాయం కావాలని..
‘మాదిగ దండోరా ‘ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ కులాలను జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి, దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అణగారిన కులాల ఆత్మగౌరవం, సమన్యాయం పంపిణీ విలువల కేంద్రంగా బయలుదేరిన దండోరా ఉద్యమం అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన ఉద్యమం సంస్థగా ఎదిగింది. అణగారిన కులాల గొంతుకగా నిలిచింది. ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిల్చింది. డోలుదెబ్బ, నంగరభేరీ, చాకిరేవు దెబ్బ, తుడుందెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మ గౌరవం, హక్కుల పోరాటాలు దండోరా స్ఫూర్తితో వచ్చాయి. దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు, పోరాట రూపాలు, విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహనా పరిదిని తాత్వికంగా విస్తృత పరిచింది. ప్రభుత్వాలను సైతం దిగివచ్చేవిధంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాలలో వచ్చిన మాంగ్(మహారాష్ట్ర), అరుంధతియ(తమిళనాడు), మాదిగల(కర్ణాటక) ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది. మొత్తం పైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కుల నిర్ములన, ఫూలే-అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాల అనుభవం, హక్కులు, వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కిచేప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో మాలలే లబ్ధి పొందుతున్నారని..
తెలుగు రాష్ట్రాల్లో దళిత జనాభాలో 70 శాతం మాదిగలు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. 30 శాతం మాలలు ఉన్నారు. అయితే రిజర్వేషన్ ఫలాలు మాత్రం 90 శాతం మాలలే పొందుతున్నారని, మాదిగలు, పది ఉప కులాలు కేవలం 10 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నాయనేది మంద కృష్ణ వాద. దళితుల్లోనే మాల సామాజిక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది. ఈ సమస్యను పరిష్కరించాలి అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఇందుకోసం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.