https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..వైరల్ అవుతున్న వీడియో!

కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'వేవ్స్' అనే కార్యక్రమంలో చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : February 8, 2025 / 01:51 PM IST
    Narendra Modi praises Chiranjeevi

    Narendra Modi praises Chiranjeevi

    Follow us on

    Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి స్థానం ముఖ్యమంత్రి కంటే పవర్ ఫుల్ అని ఆయన అభిమానులు గర్వంగా చెప్తుంటారు. ఎందుకంటే చిరంజీవి కష్టపడి ఎదిగిన తీరు, పైసా లాభం ఆశించకుండా చేసిన సేవా కార్యక్రమాలు అలాంటివని, దేశంలో ఏ హీరో కూడా ఇన్ని సేవా కార్యక్రమాలు తమ సొంత డబ్బులతో చేయలేదని చెప్పుకుంటూ ఉంటారు. రీసెంట్ గానే ఒక ప్రభుత్వ కార్యక్రమం లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత గౌరవించాడో మనమంతా చూసాము. ఇది మెగాస్టార్ రేంజ్ అంటే అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు గర్వంగా ఆ వీడియోలు షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రధాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వేవ్స్’ అనే కార్యక్రమంలో చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

    మోడీ మాట్లాడుతూ ‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం..యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. మోడీ మాట్లాడిన మాటలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకొని తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ వేవ్స్ అడ్వైజరీ బోర్డు లో అంతమంది ముందు ప్రధాని మోడీ గారు నా గురించి మాట్లాడడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని ప్రారంభించిన ‘వేవ్స్’ ఇండియా సాఫ్ట్ పవర్ ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తుంది అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన షేర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా సంచలనంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి స్థాయి ఇది అంటూ అభిమానులు మరోసారి గర్వం గా చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో చిరంజీవి కి హిట్స్ రావొచ్చు, ఫ్లాప్స్ రావొచ్చు, కానీ ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఆయన వేసిన ముద్ర ని ఎవ్వరూ చెరిపేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అంజి చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గ్రాఫికల్ వండర్ ఇది. గత ఏడాది టీజర్ ని విడుదల చేయగా, దానికి నెటిజెన్స్ నుండి తీవ్రమైన ట్రోల్స్ ఎదురయ్యాయి. గ్రాఫిక్స్ చాలా చీప్ గా ఉందని, ఈ గ్రాఫిక్స్ కోసమా అంత బడ్జెట్ ఖర్చు చేస్తుంది అంటూ పెదవి విరిచారు. సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని గేమ్ చేంజర్ కోసం వాయిదా వేయించారు. సమయం బాగా దొరకడంతో గ్రాఫిక్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. క్వాలిటీ విషయం లో ఎక్కడా తగ్గకుండా చూస్తున్న ఈ చిత్రం, ఈ ఏడాది మే నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుంది అనేది.