Mahesh Babu- Rajamouli : మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటకి తెలియజేయకుండా చాలా గోప్యంగా ఉంచుతున్న రాజమౌళి ఇకమీదట కూడా ఎలాంటి విషయాలను ఎక్కడా బయటికి రివీల్ చేసే అవకాశాలు అయితే లేనట్టుగా తెలుస్తున్నాయి… ఆయన లాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. మరి ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లని సాధించాలని చూస్తున్నాడు. ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో మరొక భారీ హీరోని కూడా తీసుకురావాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే సీనియర్ హీరో అయితే బాగుంటుందని తను ఆలోచిస్తున్నాడట. ఇక మలయాళం స్టార్ హీరో అయిన మమ్ముట్టి చేత ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటింప చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఇంతకీ ఏ పాత్రలో నటిస్తున్నాడు పాజిటివ్ క్యారెక్టర్ లోనా, నెగిటివ్ క్యారెక్టర్ లోనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన ఉంటున్నాడు అనేది వాస్తవం…రాజమౌళి సినిమా గురించి రోజుకు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతున్నాయి. ఇక మార్కెటింగ్ విషయాల గురించి అలోచించి దానికోసమే ఆయన వివిధ భాషల్లో ఉన్న హీరోలను తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికి పృధ్వీ రాజ్ సుకుమారన్ లాంటి హీరోను తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయం మీద సరైన క్లారిటీ అయితే రాజమౌళి ఇవ్వలేదు.
మరి ఇలాంటి సందర్భంలో ఇకమీదట వచ్చే విషయాలకు కూడా ఆయన తొందర్లోనే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాడట…మరి ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లోకి వస్తుంది అనే విషయాన్ని రాజమౌళి తొందర్లోనే చెప్పడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది…