OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధమైంది. అగస్త్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ది ఆర్చీస్. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా నటించనున్నారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యశ్ హీరోగా గతవారం విడులైన KGF-2 నార్త్, సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కాగా KGF-2 ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 623.80 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 93 కోట్లు, కర్ణాటకలో రూ. 100 కోట్లు, కేరళలో 33.75 కోట్లు, తమిళనాడులో రూ. 36.25 కోట్లు, హిందీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి రూ. 256 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 104 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది.
Also Read: Victory Venkatesh Son:విక్టరీ వెంకటేష్ కొడుకు లేటెస్ట్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యపోతారు

మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రదర్శకుడు రాజమౌళి చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించారు. తనయుడు కార్తికేయతో కలిసి అర్ధరాత్రి వేళ చార్మినార్ వద్దకు వెళ్లిన రాజమౌళి అక్కడి ఫేమస్ బిర్యానీ రుచి చూశారు. రాజమౌళి రాకతో చార్మినార్ వద్ద సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీలకు జనాలు పోటీలుపడ్డారు. వారిని నిరుత్సాహపరచకుండా రాజమౌళి వారితో కలిసి ఫొటోలు దిగారు.

Also Read:Acharya : ‘ఆచార్య’ ఫస్ట్ షో అక్కడే.. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా షాకింగ్ కలెక్షన్స్ !