https://oktelugu.com/

Rajini Kanth: ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఎలా ఉందంటే…

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 29, 2021 / 05:17 PM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ హాస్పిటల్ లో చేరారు. రెండురోజుల క్రితం ఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న ఆయన తిరిగొచ్చిన వెంటనే బుధవారం రాత్రి ఆయన నటించిన ‘అన్నాత్తే’ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూశారు. గురువారం సాయంత్రం సడెన్ గా ఆయన్ను చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ విషయం బయటకు రావడంతో రజినీకాంత్ అభిమానులు ఆందోళలకు గురయ్యారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై రజినీకాంత్ భార్య లతా స్పందించారు.

    రజినీకాంత్ ఎప్పటిలానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని అన్నారు. సోషల్ మీడియాలో వస్తోన్న వదంతులను నమ్మొద్దని.. అభిమానులను టెన్షన్ పడొద్దని చెప్పారు. నిజానికి కొన్ని గంటల తరువాత ఆయన ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు.

    కానీ శుక్రవారం నాడు పూర్తిగా డాక్టర్ల అబ్సర్వేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పడంతో అక్కడే ఉంచేశారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారనే ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజినీకాంత్ ను చూడడానికి ఆయన కూతురు ఐశ్వర్య హాస్పిటల్ కు వచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ నటిస్తోన్న ‘అన్నాత్తే’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. తెలుగులో ‘పెద్దన్న’ అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.