Puneeth Rajkumar: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి ట్వీట్ ఇదే…

Puneeth Rajkumar:  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్‌. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 29, 2021 5:13 pm
Follow us on

Puneeth Rajkumar:  కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం జిమ్‌ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి సేవలందించారు పునీత్ రాజ్‌కుమార్‌. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్‌కుమార్ వెండితెర మీద తిరుగులేని స్టార్ డమ్‌ సాధించారు.

కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా, అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో 29 సినిమాలు చేశారు పునీత్‌ రాజ్‌కుమార్‌. చివరగా యువరత్న సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్‌ చేయటంతో పాటు తెలుగు ఆడియన్స్‌కు చేరవయ్యేందుకు టాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ప్రస్తుతం హోంబలే బ్యానర్‌లో ద్విత్వ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు పునీత్‌.

భజిరంగి‌-2 టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్‌ లాస్ట్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించారు. పునీత్ మరణం అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. అటు… ఆయన పార్ధివ  దేహాన్ని ఫ్యాన్స్‌ సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంకు తరలించేందుకు…  ముందుగానే రోడ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్‌ను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.