Premiere show Collections: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రీమియర్ షోల హవా ఎక్కువగా కొనసాగుతోంది… గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో లో జరిగిన సంఘటనలో ‘రేవతి’ అనే మహిళ మృతి చెందడం వల్ల పెద్ద సినిమాలకు ప్రీమియర్స్ షో లను తగ్గించారు. కానీ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన హరైహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. దాంతో ప్రీమియర్ షోస్ కి మళ్ళీ పూర్వ వైభవం దక్కిందనే చెప్పాలి. అయితే ప్రీమియర్ షోస్ చూడడం వల్ల సినిమా టాక్ అనేది ఒక రోజు ముందే తెలిసిపోతోంది. దీనివల్ల సగటు ప్రేక్షకులు సినిమాని చూడాలా వద్ద అనేది నిర్ణయించుకుంటున్నారు. ఈ విషయంలో ఈ ప్రీమియర్ షోస్ అనేవి ఒక రకంగా రివ్యూస్ చెప్పేవాళ్ళకు ప్లస్ అవుతున్నాయి కానీ సినిమాకు ఏమాత్రం హెల్ప్ అవ్వడం లేదు. ఒకరోజు ముందే వాళ్ళు సినిమాని చూసి రివ్యూ పెట్టడం వల్ల వాళ్లకు వ్యూస్ ఎక్కువగా పెరగడమే కాకుండా వాళ్లకు రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అవుతోంది…
Also Read: Kingdom Movie Review: కింగ్డమ్ మూవీ ఓవర్సీస్ రివ్యూ వచ్చేసింది..సినిమా పరిస్థితి ఏంటంటే?
ప్రీమియర్ షోస్ కోసం టికెట్ రేట్ ని డబుల్, త్రిబుల్ చేసి అమ్మడం వల్ల సినిమాకి భారీ లాభాలు వస్తున్నాయని అనుకుంటున్నారు. కానీ సినిమా టాక్ అనేది ఒక రోజు ముందే తెలియడం వల్ల రిలీజ్ రోజు నాలుగు షో లకు బుక్ అవ్వాల్సిన టిక్కెట్లు అవ్వకుండా పోతున్నాయి. దీనివల్ల సినిమాకి భారీగా మైనస్ అయితే జరుగుతోంది. దీనివల్ల ప్రీమియర్ కి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఆ తదుపరి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం అది సినిమా మీద భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు కానీ నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాకి మొదటి రోజే హౌస్ ఫుల్ కలెక్షన్స్ అయితే దక్కడం లేదు… ప్రీమియర్ షోస్ వల్ల కొంత లాభం జరిగితే, మరి కొంత వరకు నష్టం అయితే వాటిల్లుతుంది…ఆయా సినిమా హీరోల అభిమానులు సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందే సినిమాని చూసామని సంబరపడుతున్నారు.
Also Read: కింగ్డమ్ లో ఈ రెండు సన్నివేశాలు.. సినిమాను ఏం చేస్తాయి..?
కానీ సినిమా టికెట్టు డబుల్ అవ్వడం వల్ల సగటు ప్రేక్షకులు సినిమా థియేటర్ కి రావడమే మానేస్తున్నారు. ఇక టికెట్ల రేట్లు పెంచడం కూడా సినిమాని చంపేస్తుందనే చెప్పాలి. టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్ల సగటు ప్రేక్షకులు సినిమాని థియేటర్లో చూడడం కంటే వారం రోజులు ఆగితే ఓటిటి లో చూడొచ్చు అనే ఉద్దేశ్యంతో ఉంటున్నారు.
దానివల్ల కొంతమంది మాత్రమే సినిమా థియేటర్ కి వస్తున్నారు. టికెట్ రేట్ పెంచడం వల్ల కూడా ప్రధాన సమస్యగా మారిపోయింది. టికెట్ రేట్ నార్మల్ గా ఉంటే సినిమాలు చూడడానికి చాలామంది జనాలు ముందుకు వస్తారు. తద్వారా థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది.
Also Read: విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగ పెద్ద ప్లాన్..?
ఒక రకంగా సినిమా హౌస్ ఫుల్ గా నడిస్తే దానికి పాజిటివ్ టాక్ వచ్చినట్టుగా భావిస్తూ ఉంటారు. అలా కాకుండా టికెట్ రేటు పెంచడం వల్ల హౌజ్ ఫుల్ అయిన కూడా చాలా మంది జనాలు థియేటర్ కి అయితే రావడం లేదు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఒకవేళ ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే మాత్రం థియేటర్లు మూతపడటం ఖాయం…