Kingdom Movie Latest Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి ప్రేక్షకుల విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ లను సాధించకపోవడంతో ఇకమీదట ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri)దర్శకత్వంలో ఆయన చేస్తున్న కింగ్డమ్ (Kingdom) సినిమా రేపు రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే యూఎస్ఏ లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే పడిపోయాయి. మరి ఈ ప్రీమియర్స్ ని చూసిన జనాలు సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో సత్యదేవ్ విజయ్ దేవరకొండల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలైట్ కాబోతుందట.
Also Read: ఓజీ లో పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకోవడానికి భయపడిన స్టార్ హీరో…వైరల్ వీడియో…
అలాగే వీరిద్దరు బ్రదర్స్ అని తెలిసే సిచువేషన్ కూడా సినిమాకి భారీ ఎమోషన్ ను చేకూర్చబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్ళిద్దరు కలిసి రౌడీలను చంపే సీక్వెన్స్ కూడా సినిమా మొత్తానికి హైలెట్ అవ్వబోతుందట. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా విజయంలో కీలకపాత్ర వహించబోతోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
మరి ఏది ఏమైనా కూడా రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమాతో విజయ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read: రాజమౌళి కథ చెబితే రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమాతో ఓవర్ నైట్ లో ఆయన స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి ఎదుగుతాడంటూ అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది…