Prema Entha Madhuram Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా మంచి ప్రేమ కథ నేపథ్యంలో రావడంతో యువత కూడా ఈ సీరియల్ ను బాగా ఇష్టపడుతున్నారు. ఇక అను తన ఇంటి ముందు ముగ్గు వేయగా అప్పుడే సంపత్ తండ్రి రఘుపతి వచ్చి వాకిట్లో ముగ్గు వేసినంతగా కోటీశ్వరుడిని కూడా ముగ్గులో వేసింది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వెంటనే అను రఘుపతి అంటూ అరుస్తూ చెయ్యి లేపడంతో రఘుపతి భయపడతాడు. ఇక అను రఘుపతి కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో రఘుపతి అను కొట్టిన దెబ్బలను గుర్తు చేసుకుంటూ భయపడుతుంటాడు. అను పెద్దవాళ్ళు పెద్దవాళ్ళులాగానే ఉండాలి అంటూ మరోసారి మా జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోను అంటూ గట్టిగా క్లాస్ ఇస్తు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వెంటనే రఘుపతి ఆర్య భార్యవి అయితునందుకు ధైర్యంగా ఉన్నావ్ అంటూ చూస్తా పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా అంటూ కోపంతో రగిలిపోతాడు.
మరోవైపు మాన్సీ కోపంతో ఉండగా నీరజ్ వచ్చి ప్రశ్నిస్తాడు. దాంతో తనకు ఇకపై అంతా హోదా ఉండదు అంటూ చెప్పేసరికి.. నీరజ్ కోపం అవుతూ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అవును అంటూ రేపటితో అన్ని మార్పులు ఉంటాయని అను ఈ ఇంటికి కోడలు అవుతుంది అంటూ పెద్ద కోడలి హోదాగా తనకు ఉండాల్సిన బాధ్యతలు తనకు ఉంటాయని కానీ మనం ఇలాగే ఉంటాము అంటూ మాట్లాడుతుంది. మనకు కూడా ఆస్తులు పంచాలి అంటూ హోదాల గురించి మాట్లాడేసరికి మాన్సీ మాటలకు నీరజ్ ఫైర్ అవుతూ అరుస్తాడు. ఆ పక్కనే మీరా వారి మాటలు వింటూ అక్కడికి వచ్చి మంగళ స్నానానికి రమ్మంటున్నారు సార్ అంటూ చెప్పి వెళ్తుంది. వాళ్ల మాటలు వింటూ సంతోషపడుతుంది మీరా.
ఇక ఆర్య దగ్గరికి తమ బిజినెస్ కి సంబంధించిన ఓ వ్యక్తి రావడంతో కాసేపు తమ వ్యాపారం గురించి మాట్లాడుతూ.. జిండే కి సైగ చేస్తాడు ఆర్య. వెంటనే జిండే శుభలేఖలు గురించి ఏమైనా జలంధర్ కార్డ్స్ వచ్చాయేమో అనే ఉద్దేశంతో మాట్లాడగా ఆ వ్యక్తి మామూలుగానే సమాధానం చెబుతాడు. కాని తమ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేశారంటూ స్పెషల్ ఇన్విటేషన్ ఉంటుందంటూ చెప్పేసరికి షాక్ అవుతారు. అంతలోనే ఆర్య తల్లి వచ్చి ఏమైనా పనులు ఉంటే ఇప్పుడే చూసుకోవాలి అంటూ తర్వాతకు బయటికి వెళ్ళకూడదు అని చెబుతుంది. ఇక జలంధర్ కొంతమందిని పెళ్లిలో ఆర్య పరువు తీయడానికి రెడీ చేశాడు. వారికి ఎలా ఉండాలో వివరిస్తాడు.
మాన్సీ తన అత్త దగ్గరికి వచ్చి అందరి ముందు వ్యాపారంలో భాగస్వామ్యం, అనుతో సమాన హోదా కావాలని అనడంతో అందరు షాక్ అవుతారు. జిండే ఇది అడగాల్సిన సందర్భం కాదు అనేసరికి.. మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం మీరు సైలెంట్ గా ఉండండి అంటూ జిండేపై అరుస్తుంది. ఇక ఆర్య తల్లి జిండే ఇంట్లో వ్యక్తి అనేసరికి మరింత కోపంతో రగిలిపోతుంది. నీరజ్ ఎంత చెప్పినా కూడా మాన్సీ వినకుండా అరుస్తుంది. ఆర్య తల్లి వెంటనే అడగడానికి నీకు అర్హత లేదు అంటూ.. ఎందుకంటే.. అనేసరికి జిండే వచ్చి అమ్మ అని ఆపుతాడు. అయినా కూడా మాన్సీ నాకు తెలియాలి అనేసరికి నీరజ్ కోపంతో అన్నయ్య గురించి మాట్లాడితే నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధమే అంటూ చెప్పేసరికి అందరు షాక్ అవుతారు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Prema entha madhuram serial unexpected twist meera plans riots
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com