తమ సంస్థకు సంబంధించిన ఫుడ్ కార్పొరేషన్ బాధ్యతలను మాన్సీ కి అప్పజెప్పాలని చెప్పేసరికి అందరు షాక్ అవుతారు. మాన్సీ కి నోట నుండి మాట కూడా రాలేకపోతుంది. మరోవైపు మీరా ప్లాన్ మొత్తం అడ్డం తిరిగింది అంటూ బాధపడుతుంది. ఇంట్లో వాళ్లంతా ఆర్య మాన్సీకి ఇచ్చిన బంపర్ ఆఫర్ గురించి షాక్ అవుతూ ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అన్ని తన తల్లి ప్రశ్నిస్తుంది. ఈ ఇంటి కోడళ్లకు సమాన హోదాలు ఉండాలి అంటూ చెప్పేసరికి మాన్సీ బాగా ఎమోషనల్ అయినట్లు అనిపిస్తుంది. ఆర్య మాన్సీ కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆర్య గురించి మాన్సీతో గొప్పగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక అను వాళ్ళ ఇంట్లో మంగళ స్నానం కోసం ఏర్పాటు చేస్తారు. ఆర్య వాళ్ళ ఇంట్లో కూడా మంగళ స్నానం సందడి కనిపిస్తుంది. మొత్తానికి మాన్సీ బాగా సంతోషంగా హడావుడి చేస్తుంది. నీరజ్ వచ్చి మాన్సీని ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు సంతోషంగా ఉంటుందో అనేసరికి కొన్ని నెగటివ్ షేడ్స్ నాపై అలా జరుగుతుంటాయి అంటూ బదులిస్తుంది మాన్సీ. అక్కడే ఉన్న మీరా కాస్త ఇబ్బంది పడినట్లు కనిపిస్తుంది.
ఇక అనుకు మంగళ స్నానాలు చేయించడానికి సిద్ధం చేస్తారు. ఆర్య కూడా మంగళ స్నానానికి సిద్ధమవ్వగా తన తల్లి పసుపు పెట్టకపోవడంతో తన తల్లి దగ్గరికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఇక మాన్సీ, నీరజ్, జిండే లు పసుపు పెడతారు. మాన్సీ.. మీరా కు చివరి అవకాశం ఇస్తూ మీరాతో కూడా పసుపు పెట్టిస్తుంది. మీరా తన మనసులో భార్య కావాల్సిన దాన్ని పసుపు పెడుతున్నాను అంటూ బాధపడుతుంది. ఇక అను సంతోషాన్ని తన నాన్న దూరం నుండి చూస్తూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ దీవిస్తాడు.మొత్తానికి అను, ఆర్యలకు పెళ్లి కళ రావడమే కాకుండా.. మంగళ స్నానం వేడుక బాగా సందడిగా అనిపించింది.