Homeఎంటర్టైన్మెంట్Prema Entha Madhuram Serial: అను, ఆర్యల పెళ్లికి మరో అడ్డంకి.. టాబ్లెట్స్ కలిపిన నీళ్లు...

Prema Entha Madhuram Serial: అను, ఆర్యల పెళ్లికి మరో అడ్డంకి.. టాబ్లెట్స్ కలిపిన నీళ్లు తాగిన అను కుటుంబం!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. మీరా.. జలంధర్ ఇచ్చిన టాబ్లెట్స్ లను వాటర్ లో కలిపి పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అంతలోనే తనకు ఆర్య చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో టాబ్లెట్లను పక్కకు పడేసి వెళ్ళిపోతుంది. పక్కనే ఉన్న రఘుపతి నాకు అంత జాలి లేదని ఆ టాబ్లెట్లను నీళ్ళల్లో కలుపుతాడు. అదే సమయంలో అందులో పనిచేసే మరో వ్యక్తి వచ్చి గొడవ చేస్తాడు.

Prema Entha Madhuram Serial: another problem in anu arya marriageఇక పద్దు.. సుబ్బు సంతోషాన్ని చూసి మురిసిపోతుంది. సుబ్బు దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా.. ఆ వ్యక్తి గొడవ చేయడంతో పరిగెత్తుకు వస్తాడు రఘుపతి. సుబ్బు కాపాడు అంటూ అనేసరికి సుబ్బు మా బస్తీకి చెందినవాడని పంపిస్తాడు. ఎందుకు వచ్చావని పద్దు కోపంగా అడుగుతుంది. పెళ్లికి పిలవలేదని దూరం నుండి చూసి వెళ్దామని వచ్చానని అనేసరికి సుబ్బు కూడా కోపం అవుతాడు. క్షమించండి అంటూ మొత్తానికి ఆ నీళ్లను తాపిస్తాడు.

ఇక పద్దు అను దగ్గరికి వెళ్లి అనుకి కూడా ఇవ్వడంతో అను ఆ వాటర్ తాగుతుంది. మరోవైపు ఆర్య పెళ్ళికొడుకు గెటప్ లో రెడీ అవ్వగా అందరూ చూసి మురిసిపోతారు. అడ్డంకులన్నీ దాటాయని ఆనందపడతారు. ఇక జిండే అను దగ్గరికి వెళ్ళాలి అంటూ.. మేనమామగా చేసే కొన్ని పనులు ఉన్నాయని అనేసరికి వెంటనే ఆర్య జిండే మాటలకు మరింత సంతోషపడుతాడు. అను కూడా పెళ్లి కూతురుగా రెడీ అవ్వగా తన తల్లిదండ్రులు దీవిస్తారు.

అప్పటికే అనుకి కళ్ళు తిరుగుతుంటాయి. పక్కనే ఉన్న మాన్సీ, అను తల్లిదండ్రులు టెన్షన్ పడటంతో ఉపవాసం ఉందని అందుకే అలా అవుతుంది అని కంగారు పడుతుంది పద్దు. ఇక జిండే వచ్చి మేనమామగా భాషింగం కట్టి దీవిస్తాడు. వెంటనే మాన్సీ ఏదైనా అడగాలి అని జిండేతో అనడంతో ఇప్పుడు కాదు అను ఆర్య వర్ధన్ ఇంట్లో అడుగుపెట్టాక అప్పుడు అడుగుతా అని అనగా లేదు ఇప్పుడే చెప్పాలని అనడంతో తనకు ఆఫీస్ పనులలో స్ట్రెస్ పోవడానికి.. ఆడుకోవడానికి ఒక చంటి వాడు కావాలని అనేసరికి అందరు సంతోషపడతారు. అను సిగ్గుపడుతుంది.

మరోవైపు ఆర్య రాజనందిని తాళిబొట్టును పట్టుకొని ఈ తాడుని అను మెడలో కడుతాను అని తన తల్లితో చెబుతాడు. అను పూజ చేస్తున్న సమయంలో తనకు కళ్ళు తిరగడం మొదలవుతుంది. పెళ్లి మండపంలో ఆర్య పెళ్ళికి సిద్ధంగా ఉంటాడు. అను కాసేపు రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్పి ఎందుకిలా అవుతుంది అనుకొని మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటుంది. అమ్మవారి దగ్గరికి వచ్చి ఇటువంటి అడ్డంకులు రాకుండా చల్లగా ఉండాలని కోరుకుంటుంది. అదే సమయంలో రాజనందిని కూడా కోరుకుంటుంది. మొత్తానికి పెళ్లి మండపంలో ఆర్య అనులకు పెళ్లి పూజ జరుగుతుంది. అను కి ఏ సమయంలో ఏం జరుగుతుందో అని కాస్త ఆసక్తి గా అనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే మళ్లీ వీరి పెళ్లికి మరో అడ్డంకి వచ్చేలా ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version