Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam Serial: మోనిత జైలుకు వెళ్లిన కార్తీక్ కుటుంబాన్ని వీడని ఆందోళన..!

Karthika Deepam Serial: మోనిత జైలుకు వెళ్లిన కార్తీక్ కుటుంబాన్ని వీడని ఆందోళన..!

స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు రేటింగ్స్ పెరుగుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా స్కూల్లో పిల్లలకు తన స్నేహితురాలి ద్వారా తన తండ్రి మోనితని మోసం చేశారని తెలియడంతో ఎంతో బాధపడుతుంటారు. కార్తీక్ స్కూల్ దగ్గరికి వెళ్లి పిల్లలని పికప్ చేసుకోగా పిల్లలిద్దరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి వెనక సీటులో కూర్చుంటారు. పిల్లలు ఏమి మాట్లాడకపోవటంతో కార్తీక్ ఏమైంది అని అడగగా.. ఏం మాట్లాడకుండా అలా ఉన్నారు ఏంటి అని ప్రశ్నల పై ప్రశ్నలు వేసిన పిల్లలు ఏమీ మాట్లాడరు.

Karthika Deepam Serial Because of Monitha Karthik Family is Suffering

ఇక సౌందర్య గతంలో మోనితని మాట్లాడిన మాటలు ఆ సంగతులన్నీ గుర్తుతెచ్చుకొని బాధపడుతుంది. అంతలోనే దీప ఆందోళనగా రావడం చూసి ఏమైంది అనగా డాక్టర్ బాబు గురించి బస్తీలో అందరూ చాలా చెడుగా మాట్లాడుతున్నారని వారణాసి ఏడుస్తూ చెప్పాడు అత్తయ్య అంటూ సౌందర్య కు జరిగినది చెబుతుంది. ఈ మాటలు విన్న సౌందర్య దీపను ఓదారుస్తూ ఆమెకు ధైర్యం చెబుతుంది. మరోవైపు పిల్లలు తన స్కూల్లో స్నేహితులు అన్న మాటలను గుర్తుచేసుకొని బాధపడుతుంటారు. ఇంటికి వస్తే సౌందర్య పువ్వులన్ని గుచ్చుతూ ఉన్న సమయంలో కార్తీక్ వచ్చి ఎందుకు మమ్మీ ఇవన్నీ అని అనగా దీప వ్రతంచేస్తుందటరా పరిస్థితులన్నీ చెక్కబడ్డాయి కదా అని అనడంతో ఏం చెక్కబడ్డాయి మమ్మీ పరిస్థితులు అంటూ దిగాలుగా కూర్చుంటాడు.

కారులో పిల్లలు తన పక్కన కూర్చోకుండా వెనుక వెళ్లి కూర్చోవడం తను మాట్లాడిన ఒక్క మాటకూడా మాట్లాడలేదని కార్తీక్ సౌందర్యతో చెప్పుకుంటాడు.అదే సమయంలో అక్కడికి వచ్చిన సౌర్య వాటర్ బాటిల్ తీసుకొని వెళుతుండగా సౌదర్య తనని పిలుస్తుంది సౌందర్య మాట విన్న సౌర్య హిమ పిలవకపోయినా వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అది చూసిన సౌందర్య కార్తీక్ బాధపడతారు. మరోవైపు దీప మోనితని ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెబుతూ బాధపడిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. ఇలా మోనితని వారిమధ్య లేకపోయినప్పటికీ దీప కుటుంబం లో ఎన్నో ఆందోళనలను సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఇక తరువాయి ఎపిసోడ్లో పిల్లలు తల్లిదండ్రులను నిలదీస్తున్నారా అసలు విషయాన్ని తెలుసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version