Praveen Chikoti: ఎంతో ఆనందంగా జరగాల్సిన ‘వారణాసి'(Varanasi Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈవెంట్ పై డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) ఎందుకో పూర్తి స్థాయిలో సంతృప్తి గా లేడు. దీంతో కాస్త ఫ్రస్ట్రేషన్ కి గురైన రాజమౌళి హనుమంతుడి పై నోరు జారాడు. మా నాన్న, నా భార్య హనుమంతుడిని చాలా నమ్ముతారు, నేను దేవుడిని పెద్దగా నమ్మను, కానీ ఈరోజు ఈవెంట్ లో ఎంతో కస్టపడి ఈ LED ని ఏర్పాటు చేస్తే, గ్లింప్స్ వీడియో ప్లే అవ్వలేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్, అదే విధంగా హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. నిన్న అయితే రాజమౌళి వ్యాఖ్యలపై పోలీస్ కేసు కూడా నమోదు అయ్యింది. అదే విధంగా బీజేపీ నాయకులూ కూడా రాజమౌళి పై మండిపడుతున్నారు.
బీజేపీ నేత చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ ‘ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడేందుకు రాజమౌళి కి ఎలాంటి అర్హత లేదు. దేవుడి మీద సినిమా చేస్తూ, దేవుడినే నిందించడం దురదృష్టకరం. రాజమౌళి ఒక్కసారి నీ సినిమాలను హిందువులు మొత్తం చూడడం మానేస్తే నీ బ్రతుకు ఏమి అవ్వుద్దో ఊహించుకో. దేవుడి మీద అంత నమ్మకం లేని వాడివి ఎందుకు దేవుడి ని ఉపయోగించు డబ్బులు సంపాదించుకుంటున్నావు. నీ సినిమాలను నాస్తికులకు నచ్చేట్టు, నాస్తికలతోనే సినిమాలు తెరకెక్కించు. నాస్తిక కుక్కలే నీ సినిమాని చూడడానికి అనుమతి ఇవ్వు. అంత దేవుడి మీద నమ్మకం లేని వాడివి, నీ ప్రతీ సినిమాకు ఎందుకు పూజా కార్యక్రమాలు చేస్తున్నావు. బిడ్డా రాజమౌళి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పు. లేదంతే శాశ్వతంగా నువ్వు ఒక ద్రోహిగా మిగిలిపోతావు’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రవీణ్. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మీకోసం క్రింద అందిస్తున్నావు చూడండి.
కేవలం ప్రవీణ్ మాత్రమే కాదు, రాజమౌళి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి వారు కూడా స్పందిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ‘అది అయన అభిప్రాయం.. ఏమో దేవుడు ఆయన్ని నమ్మించే విధంగా భవిష్యత్తులో ఏమైనా చేసాడేమో చూద్దాం. రాజమౌళి కి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని, అతను ఇంకా ఉన్నతమైన శిఖరాలను అధిరోగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు బండి సంజయ్. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, దీని గురించి బయట ఇంత రచ్చ జరుగుతున్నప్పటికీ కూడా రాజమౌళి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడమే. అంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు అసలు సంబంధమే లేదు అని రాజమౌళి అనుకుంటున్నాడా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి.
రాజమౌళి.. హిందువులు నీ సినిమాలు చూడకపోతే నీ బ్రతుకు ఏమవుద్దో తెలుసు కదా
రాజమౌళి సినిమాలను నాస్తిక కుక్కలతోనే తీయాలి.. నాస్తిక కుక్కలే సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలి
దేవుడిని నమ్మకపోతే ప్రతి సినిమాకు ముందు పూజ ఎందుకు చేస్తున్నాడు
బిడ్డా రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు… https://t.co/rNghWH56UN pic.twitter.com/a3N2SaWB2y
— Telugu Scribe (@TeluguScribe) November 19, 2025