https://oktelugu.com/

ప్రభాస్ అమాయకుడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ !

ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు ప్రశాంత్ నీల్. పైగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఇంతవరకూ ఏ కన్నడ సినిమా సృష్టించలేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. దాంతో ప్రశాంత్ మార్కెట్ నేషనల్ రేంజ్ లో పెరిగింది. ఇక ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా సినిమా […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 12:40 PM IST
    Follow us on


    ఎలాంటి సపోర్ట్ లేకుండా చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ.. కన్నడనాట ఏకంగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు ప్రశాంత్ నీల్. పైగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్- 1` సృష్టించిన సంచలనాలు ఇంతవరకూ ఏ కన్నడ సినిమా సృష్టించలేదు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత‌ వసూళ్లు సాధించింది ఈ చిత్రం. దాంతో ప్రశాంత్ మార్కెట్ నేషనల్ రేంజ్ లో పెరిగింది. ఇక ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

    Also Read: బిగ్‌ బాస్ కి బిగ్ షాక్ ఇచ్చిన నోయల్ !

    అయితే కన్నడ స్టార్ తో సినిమా చేయకుండా.. ప్రభాస్ తో సినిమా ఎందుకు చేస్తున్నావ్ అంటూ కన్నడ మీడియా ప్రశాంత్ పై కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ కు ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. “నా కథకు అమాయకమైన లుక్స్ ఉండే స్టార్ హీరో కావాలి. ప్రభాస్ లో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి క్వాలిటీ ఉన్న హీరో నాకు మరొకరు కనిపించలేదు. తెరపై అమాయకత్వాన్ని అద్భుతంగా పండిస్తాడు ప్రభాస్.” అంటూ ప్రభాస్ గురించి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

    Also Read: రెడ్ పరిస్థితి ఏంటి ? ఓటీటీలోనా? థియేటర్ లోనా?

    అయినా ఈ కేజీఎఫ్ దర్శకుడు శాండిల్ వుడ్ ను వదిలేశాడని, తన నెక్ట్స్ మూవీకి టాలీవుడ్ స్టార్ ను సెలక్ట్ చేసుకున్నాడంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిపై ప్రశాంత్ నీల్ స్పందించినా.. విమర్శలు మాత్రం ఆగట్లేదు. ఇక ప్రశాంత్ ప్రస్తుతం చేస్తోన్న కేజీఎఫ్ సినిమా ఇండియా లెవల్లో కొన్ని మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఈ సినిమా ముందువరుసలో నిలిచింది. అందరూ ఈ సినిమా కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇక కేజీఎఫ్ అంటే.. ద‌శాబ్ధాల క్రితం కోలార్ బంగారు గ‌నుల పై రౌడీల కన్ను, ప్ర‌పంచ మాఫియా క‌న్ను ఎలా ఉండేది అన్న‌ కోణంలో సినిమా సాగుతోంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్