వ్యాక్సిన్ వేయించుకోవడానికి మాజీ అధ్యక్షులు రెడీ..

  కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే నేను వేయించుకుంటానని తెలిపారు. నేను సైన్స్ ను నమ్ముతానని, అందువల్ల ప్రజల్లో అవగాహన కల్పించేందకు పబ్లిగ్గానే వ్యాక్సిన్ తీసుకుంటానని తెలిపారు. అలాగే మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా పబ్లిగ్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అధికార ప్రతినిధి ఏంజెల్ యురేనా వెల్లడించారు. […]

Written By: Suresh, Updated On : December 4, 2020 12:47 pm
Follow us on

 

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే నేను వేయించుకుంటానని తెలిపారు. నేను సైన్స్ ను నమ్ముతానని, అందువల్ల ప్రజల్లో అవగాహన కల్పించేందకు పబ్లిగ్గానే వ్యాక్సిన్ తీసుకుంటానని తెలిపారు. అలాగే మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా పబ్లిగ్గా వ్యాక్సిన్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన అధికార ప్రతినిధి ఏంజెల్ యురేనా వెల్లడించారు. ఇక జార్జి బుష్ సైతం తాను వ్యాక్సిన్ ప్రయోగానికి సిద్ధమని తెలిపారు. కాగా త్వరలోనే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.