varun lavanya
Varuntej – Lavnya Thripati : కొన్నేళ్లుగా సినిమాల ద్వారా పరిచయమై.. ప్రేమించుకొని ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కారు. ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఉన్న ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్న ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏకంగా ఇటలీ దేశంలో ఈ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మెగా ఫ్యామిలీ, అతిథులు అందరూ ఇటలీకి చేరుకున్నారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి నవంబర్ 2న జరుగనున్న సంగతి తెలిసిందే.. ఇటలీకి అందరూ చేరుకున్నారు. వరుణ్ తేజ్ స్నేహితులు హీరోలు కూడా ఫ్యామిలీతో హాజరయ్యారు. అల్లు అర్జున్, హీరో నితిన్ లు ఫ్యామిలీతో హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మెహెందీ వేడుకలో నితిన్ భార్య, బన్నీ ఫ్యామిలీ ఫొటోలు వైరల్ అయ్యాయి.