https://oktelugu.com/

KA Movie : చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించిన ‘క’ సినిమా కి సెకండ్ పార్ట్ కూడా రాబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. అయితే తమదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు సైతం సినిమాలు చేస్తూ వాళ్లకు సాటి ఎవ్వరు లేరు అనేంతలా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక తనదైన రీతిలో సినిమాలను చేస్తున్న స్టార్ హీరోలు సైతం వరుస సక్సెస్ లను సాధిస్తూ పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకోవడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 3, 2024 / 02:50 PM IST

    KA Movie

    Follow us on

    KA Movie :  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్లకే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. ఒకప్పుడు టాలెంట్ ఉన్నా లేకపోయినా కూడా హీరోలను చేసి జనాల మీద రుద్దేవాళ్లు… కానీ ఇప్పుడు అలా కాదు ప్రత్యేకంగా టాలెంట్ ఉన్న హీరోలకు మాత్రమే సక్సెస్ అనేది దక్కుతుంది. ఒకవేళ టాలెంట్ లేకపోతే మాత్రం వాళ్ళు ఫేడౌట్ దశకు చేరుకుంటున్నారనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను చాటుకున్న కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘క ‘ సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. చాలా సంవత్సరాలుగా అతనికి సక్సెస్ దక్కడం లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టు ప్లాప్ అవుతుండడంతో ఆయన కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇలాంటి సందర్భంలోనే ఆయన క సినిమాతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ఈ సినిమాను బిగ్గెస్ట్ సక్సెస్ గా చెప్పుకోవచ్చు…

    ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన క్రమంలో ఈ సినిమాకి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తాకైతే మొదటి పార్ట్ సక్సెస్ అయినప్పుడు సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి ఆ అంచనాలను క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు మరొక పార్ట్ ని చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నడుస్తున్న మార్కెట్ ట్రెండ్ కూడా ఇదే కావడం వల్ల వాళ్ళు ఈ పద్ధతిని అనుసరించి ఈ సినిమాకి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం మొత్తానికైతే ఒక భారీ సక్సెస్ సాధించి తన అభిమానులకు కానుకగా ఇచ్చాడనే చెప్పాలి… ఇక ఈ సీక్వెల్ కనక సూపర్ సక్సెస్ సాధిస్తే కిరణ్ అబ్బవరం స్టార్ హీరోగా మారిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఆయనకు నటనపరంగా అంతా అనుభవం లేకపోయినా కూడా ప్రేక్షకులను మెప్పించే నటన చేయకపోయినా కూడా సినిమా కంటెంట్ లో దమ్ముంది కాబట్టి సినిమాలు ఈజీగా సక్సెస్ అవుతున్నాయి… ఇక ఏది ఏమైనా కూడా తనలాంటి ఒక యంగ్ కుర్రాడు అవకాశం కోసం ఎదురు చూడకుండా తనే అవకాశాలను కల్పించుకొని ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…