https://oktelugu.com/

Diwali Festival Cinema ,s :   ఈ దీపావళి కి సక్సెస్ సాధించిన హీరో ఎవరో తెలిసిపోయిందా..? ఏ సినిమా పరిస్థితి ఎలా ఉంది…

 తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే మన దర్శకులు మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలుగా చేస్తూ ముందుకు సాగుతున్నారు...ఇక ఇది ఏమైనా కూడా భారీ సక్సెస్ ను సాధించడానికి ఇప్పటికీ మన దర్శకులు భారీ కసరత్తులను చేయడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : November 2, 2024 / 09:31 PM IST

    Kiran abbavaram

    Follow us on

    Diwali Festival Cinema ,s : దీపావళి కానుకగా రీసెంట్ గా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అవ్వగా, తమిళ్ నుంచి ఒక సినిమా, కన్నడ ఇండస్ట్రీ నుంచి మరొక సినిమా రిలీజ్ అయింది. మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్ అయిన నేపధ్యంలో ఈ నాలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    మొదటగా కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ దీపావళికి లక్ష్మీ బాంబుల పేలిన క సినిమా కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచింది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబడుతుందంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

    వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘లక్కీ భాస్కర్’ సినిమా కూడా మంచి టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఈ సినిమాలో ఎమోషన్స్ హైలెట్ గా నిలవడమే కాకుండా సినిమా మొత్తాన్ని దర్శకుడు మలిచిన తీరు కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉందని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులందరిలో ఒక అటెన్షన్ క్రియేట్ చేసుకుంటుందనే చెప్పాలి…

    ఇక శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కిన ‘అమరన్ ‘ సినిమా తెలుగులో కూడా డబ్ అయితే ఈ సినిమా ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు సాగుతుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కావడం అలాగే ఒరిజినల్ స్టోరీ తో తెరకెక్కిన సినిమా అవ్వడం వల్ల ఈ సినిమా చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు…

    ఇక ప్రశాంత్ నీల్ కథ మాటలు అందించిన ‘ బఘీర ‘ సినిమా కూడా దీపావళి కానుకగా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన విషయం చాలామందికి తెలియదు. ఇక సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రశాంత్ నీల్ టైప్ ఆఫ్ మేకింగ్ తోనే సాగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాకపోవడంతో కొద్ది వరకు మేకర్స్ ను నిరాశపరిచిందనే చెప్పాలి…

    ఇక ఇదిలా ఉంటే ఈ నాలుగు సినిమాల్లో మంచి విజయాన్ని సాధిస్తూ భారీ కలెక్షన్లను సంపాదిస్తూ ముందుకు దూసుకెళుతున్న సినిమాల్లో క సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు మంచి పొజిషన్ల ను దక్కించుకోవడం విశేషం…