Salaar: ప్రశాంత్ నీల్ సలార్ లో ఆ సీన్ ని బాహుబలి 2 నుంచే కాపీ చేశాడు…ఇదిగో ప్రూఫ్…

ప్రభాస్ మరోసారి తన రేంజ్ స్టామినాని చూపించడంతో బాక్సాఫీస్ రికార్డులు మొత్తం బ్రేక్ అవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.

Written By: Gopi, Updated On : December 28, 2023 2:44 pm

Salaar

Follow us on

Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో అనూహ్యమైన స్పందనను అందుకుంటుంది. ప్రభాస్ మరోసారి తన రేంజ్ స్టామినాని చూపించడంతో బాక్సాఫీస్ రికార్డులు మొత్తం బ్రేక్ అవుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉన్న ఒక సీన్ పట్ల బాహుబలి 2 సినిమాలో సీన్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసినట్టుగా తెలుస్తుంది.

అది ఏంటి అంటే ఈ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ని చంపడానికి ఒక కర్త కత్తి తీసుకొని వస్తుంటే మధ్యలో ప్రభాస్ అడ్డుపడి తనని ఏమి చేయకండి చేసిందంతా నేనే అంటూ వేడుకుంటాడు. అయిన కూడా తను వినకపోవడంతో ముందుగా తన చేయి నరికి ఆ తర్వాత తల నరుకుతాడు అయితే ఈ సినిమా ఈ సీన్ చూసిన చాలా మంది బాహుబలి 2 లో తప్పు చేస్తే నరకాల్సింది చేయి కాదు తల అనే సీన్ లానే ఉంది. ఆ సీన్ చూసే ప్రశాంత్ నీల్ ఈ సీన్ రాసుకున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియ జేస్తున్నారు.

Salaar

నిజానికి ఆ సీన్ కి ఈ సీన్ కి చాలా తేడా ఉన్నప్పటికీ బేసిక్ పాయింట్ మాత్రం అది ఇది సేమ్ గానే ఉంటుంది. అందుకే ఈ సినిమా చూసిన చాలా మంది బాహుబలి సినిమాని చూసి అందులో ఉన్న సీన్ ని కాపీగా చేస్తూ ఈ సీన్ రాసుకున్నాడు అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆ న్యూస్ ని ట్రోల్ చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా రెండు సీన్లు తల నరికే సీన్లు కాబట్టి అవి ఆ సినిమాలకు హైలైట్ గా నిలవడమనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక ఈ విషయంలో అటు రాజమౌళిని, ఇటు ప్రశాంత్ నీల్ ఇద్దరిని మెచ్చుకోవాలి.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ రెండు సినిమాలతో సక్సెస్ సాధించడంతో ఇక మీదట ప్రభాస్ చేసే అన్ని సినిమాల్లో తలనరకే సీన్ ఒకటి ఉండేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇక మీదట చేసే అన్ని సినిమాలతో వరుస సక్సెస్ లు కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది…ఇక మీదట వచ్చే సినిమాలు కూడా మంచి విజయాలను సాధిస్తే ప్రభాస్ ఇండియా లో నెంబర్ వన్ హీరో అవుతాడు…