https://oktelugu.com/

Prasanth Varma: ఆ బాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చేలా పోస్ట్ పెట్టిన ప్రశాంత్ వర్మ…

Prasanth Varma: మొత్తానికైతే ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కూడా ఏర్పాటు చేస్తుంది. నిజానికి ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప వరమనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 12:47 PM IST

    Prasanth Varma Take A Dig At Ranveer Singh

    Follow us on

    Prasanth Varma: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ… ఆయన తీసిన మొదటి సినిమా అయిన ‘ఆ ‘ సినిమా నుంచి రీసెంట్ గా చేసిన ‘హనుమాన్ ‘ సినిమా వరకు అన్ని వైవిధ్యభరితమైన సినిమాలే కావడం విశేషం…ఇక సినిమా సినిమాకి మధ్య సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేయడమే ఆయన ముఖ్య లక్ష్యంగా మనకు తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఈయన చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కూడా ఏర్పాటు చేస్తుంది. నిజానికి ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఒక గొప్ప వరమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

    మరి అలాంటి క్రమం లో ఈయన చేస్తున్న ప్రయత్నం అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన గత కొద్ది రోజుల క్రితం హీరో రణ్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయాలని ప్రణాళికలను రూపొందించాడు. దానికి రన్వీర్ సింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కథపరంగా ఇద్దరి మధ్య కొంత క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ప్రాజెక్ట్ అనేది పట్టలెక్కలేదు. దాంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

    అది ఏంటి అంటే ‘ప్రతి తిరస్కరణ ఒక ఆశీర్వాదమే అని మీరు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది’ అంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇక ఇది చూసిన చాలా మంది ఆయనల పోస్ట్ పెట్టడానికి కారణం రన్వీర్ సింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆయనని ఉద్దేశించే ప్రశాంత్ వర్మ ఆ పోస్టు పెట్టాడు అంటూ కొంతమంది సోషల్ మీడియా లో పలు రకాల కామెంట్లైతే చేస్తున్నారు…