https://oktelugu.com/

ప్రణీతపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

హీరోయిన్ ప్రణీత పెద్దమనస్సును చాటుకుంది. పేదల కోసం తానే స్వయంగా భోజనం తయారీచేసి 21రోజుల్లో 75వేలమందికి పంపిణీ చేసింది. ఇప్పటికే ప్రణీత సీని కార్మికులకు ఆదుకునేందుకు తనవంతు ‘సీసీసీ’ లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎంతోమంది చిన్నసాయం చేసి పెద్ద పబ్లిసిటీ చేసుకుండగా ప్రణీత మాత్రం వీటికి దూరంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె పేదలకు చేస్తున్న సేవపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రణీత అందంతోపాటు మంచి మనస్సు నటి అంటూ నెటిజన్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2020 / 07:34 PM IST
    Follow us on


    హీరోయిన్ ప్రణీత పెద్దమనస్సును చాటుకుంది. పేదల కోసం తానే స్వయంగా భోజనం తయారీచేసి 21రోజుల్లో 75వేలమందికి పంపిణీ చేసింది. ఇప్పటికే ప్రణీత సీని కార్మికులకు ఆదుకునేందుకు తనవంతు ‘సీసీసీ’ లక్ష రూపాయాల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎంతోమంది చిన్నసాయం చేసి పెద్ద పబ్లిసిటీ చేసుకుండగా ప్రణీత మాత్రం వీటికి దూరంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమె పేదలకు చేస్తున్న సేవపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రణీత అందంతోపాటు మంచి మనస్సు నటి అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.

    ప్రణీత తెలుగులో ‘అత్తారింటికి దారేది’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మూవీ సక్సస్ తర్వాత ఆమె పలుభాషల్లో మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ప్రణీత కన్నడలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. లాక్డౌన్ వల్ల షూటింగ్ వాయిదా పడటంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమతయ్యారు.

     

    కరోనా టైంలో కొందరు సెలబ్రెటీలు మేకప్ ఛాలెంజ్ లు, పిల్లో ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రణీత మాత్రం ప్రజల ఆకలి తీరుస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరోనా టైంలో కావాల్సింది ‘పిల్లో ఛాలెంజ్.. మేకప్ ఛాలెంజ్.. ది రియల్ మేన్ ఛాలెంజ్’లు కాదని ప్రణీత చేస్తున్న ‘ఫుడ్ ఛాలెంజ్’ లు కావాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్లు ప్రణీతను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.