జగన్ కు మాట్లాడే అవకాశం ఇవ్వని మోడీ..!

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడే అవకాశం లభించలేదు. దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చే క్రమంలో గత సమావేశంలో అవకాశం లభించిన ముఖ్యమంత్రులకు ఈ సారి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అవకాశం ఇవ్వాలేదు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా సీఎంలకు మాత్రమే అవకాశం లభించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 8:05 pm
Follow us on


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ మాట్లాడే అవకాశం లభించలేదు. దేశ వ్యాప్తంగా అందరు ముఖ్యమంత్రులకు అవకాశం ఇచ్చే క్రమంలో గత సమావేశంలో అవకాశం లభించిన ముఖ్యమంత్రులకు ఈ సారి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అవకాశం ఇవ్వాలేదు. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటానికి మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా సీఎంలకు మాత్రమే అవకాశం లభించింది.

వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మే 3వ తేదీ అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. సీఎం జగన్ కు అవకాశం ఇస్తే కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయమని ప్రధానికి విజ్ఞప్తి చేయాలని అనుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా పెంచామని, 10 లక్షల మందికి 1,396 పరీక్షలు చేస్తూ దేశంలో ప్రధమ స్తానంలో ఉన్నామని ప్రధానికి తెలియజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 1.5 శాతం మాత్రమే ఉన్నట్లు, టెస్టుల సంఖ్య పెంచినందువల్ల కేసుల సంఖ్య అధికంగా ఉందన్న విషయాన్ని వివరించాలని అనుకున్నారు. రాష్ట్రంలో 80 శాతం మండలాలు గ్రీన్ జోనలో ఉన్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ముగిశాక అధికారులతో సమావేశమైన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కేసులు, పరీక్షల వివరాలపై చర్చించారు.