Prakash Raj vs Manchu Vishnu: ‘మా’ ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘మోహన్ బాబు గారు బంగారం అండీ. ఆయన అంటే నాకు అభిమానం. అలాగే మోహన్ బాబు గారి కుమారులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మీ అన్నా నాకు అభిమానమే. ఇది ఏదో మాట వరసకు చెబుతుంది కాదు, వాళ్ళ కుటుంబం అంటే నిజంగానే నాకు చాలా ఇష్టం.

అందుకే, గతంలో లక్ష్మీ గారు హోస్ట్ గా చేసిన రెండు ప్రోగ్రాంస్ కి నేను వెళ్ళాను. అభిమానం లేకపోతే ఎందుకు వెళ్తాం ? నా వరకూ పర్సనల్ గా నాకు మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే గౌరవం, అభిమానం ఉన్నాయి. కాకపోతే, ఓ సందర్భంలో మంచు విష్ణు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నాడా.. లేక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడా అనడం నన్ను చాలా బాధించింది.
అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ప్రకాష్ రాజ్ ఏమి మాట్లాడాడు ?, ఏమి జరిగింది అంటే..? ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడం, దానికి ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తున్నట్లు స్టేట్ మెంట్ ఇవ్వడం.. దాంతో మంచు విష్ణు స్పందిస్తూ.. ‘ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నాడా.. లేక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడా’ అంటూ ఘాటుగా ప్రశ్నించడం,
చివరకు ప్రకాష్ రాజ్ విష్ణును అవమానించేలా.. ‘పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు నీ సినిమా బడ్జెట్’ అంటూ హేళన చేయడం.. ఇలా సాగాయి మాటల తూటాలు. అయితే, తాజాగా ముదిరిన ఈ వివాదాన్ని ఆపడానికి ప్రకాష్ రాజ్ వివరణ ఇవ్వడం బాగుంది.
మరి ఈ వివరణతో మంచు విష్ణు – ప్రకాష్ రాజ్ మధ్య వచ్చిన క్లాష్ సద్దుమణుగుతుందా ? ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ -మంచు విష్ణు మధ్య ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అభిప్రాయబేధాలు కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు నెటిజన్లు.