MAA Elections: తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో ప్రచారం ఊపందుకుంది. తాజాగా ప్రకాష్ రాజ్ మంగళవారం సిని‘మా’ బిడ్డలం పేరుతో తన ప్యానెల్ సభ్యులు, ఆయనకు మద్దతు తెలిపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మా ఎన్నికలపై ఉతికి ఆరేశారు. అద్భుతమైన లెక్కలు, పత్రాలు, మా లూప్ హోల్స్, ఎన్నికలపై అద్భుతమైన ప్రసంగం చేశారు.
మా అసోసియేషన్ లో 900 మంది సభ్యులున్నారని.. అందులో సుమారు కేవలం 150 మంది యాక్టివ్ మెంబర్స్ కాదని.. 147మంది స్థానికులు కారని.. ఇతర పరిశ్రమల నుంచి వచ్చిన వారిని తీస్తే మిగిలింది 450మంది అని ప్రకాష్ రాజ్ తెలిపారు. అందులో కూడా 200మంది బాగానే ఉన్నారని.. ‘మా’లో ఆదుకోవాల్సింది కేవలం 250మందిని మాత్రమేనని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెక్కలు, పత్రాలు కాదు.. సరైన ప్రణాళికతో ప్రకాష్ రాజ్ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.
ఆ వీడియోను కింద చూడొచ్చు.