spot_img
Homeఎంటర్టైన్మెంట్Prakash Raj: ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ వేళ, పవన్ పై పొగడ్తల వర్షం !

Prakash Raj: ప్రకాశ్‌ రాజ్‌ నామినేషన్‌ వేళ, పవన్ పై పొగడ్తల వర్షం !

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ కి మంచి విష్ణుకి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. మేమంటే మేము అంటూ ఇరు వర్గాలు బరిలో నిలిచాయి. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ సాగుతుంది. ఇక తాజాగా ఎన్నికల నామినేషన్‌ ల పర్వం మొదలయ్యే సరికి ప్రకాశ్‌ రాజ్‌ ఉత్సాహంగా ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి ఈ రోజు నామినేషన్‌ దాఖలు చేశారు.
Prakash Raj
అయితే ఊరికే నామినేషన్‌ దాఖలు చేస్తే ఎవరు పట్టించుకుంటారు ? అందుకే, ప్రకాశ్‌రాజ్‌ నామినేషన్‌ వేసిన వెంటనే అవసరం లేకపోయినా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతి విషయంలో మేం ఒక అడుగు ముందే ఉంటూ వస్తున్నాం. అయినా ఇవి ఎన్నికలు కాదు.. పోటీ మాత్రమే. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే’ అంటూ చెప్పుకొచ్చాడు. అయినా ఎన్నికలు కాదు, పోటీ అంటే ఎవరు మాత్రం నమ్ముతారు ?

ఏది ఏమైనా ప్రకాశ్‌ రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు’ అని క్లారిటీగా చెప్పడం బాగుంది. ఇక అక్టోబర్‌ 3న తన ఎన్నికల ప్రణాళికను వెల్లడిస్తానని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే ఇక్కడ ప్రకాశ్‌ రాజ్‌ పవన్ ను పొగుడుతూ మాట్లాడటం విశేషం. ‘పవన్‌ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. దేశం కోసం పోరాడుతున్నారు. మంచి నాయకుడు’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ చెప్పుకొచ్చాడు.

ఈ పొగడ్తల వరకు బాగానే ఉంది. కానీ పవన్ సిద్ధాంతాలు మంచివి, పవన్ మంచి వాడు అని ప్రకాశ్‌ రాజ్‌ నమ్మినప్పుడు, గతంలో ఎందుకు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు ? ప్రకాశ్‌ రాజ్‌ కే తెలియాలి. ఇక చివర్లో ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానెల్‌ గురించి చెబుతూ.. ‘మా ప్యానెల్‌ లక్ష్యం ‘మా’ అభ్యుదయం కోసం పనిచేయడమే. రాజకీయ వ్యాఖ్యలపై దయచేసి ఎవరూ ప్రశ్నించవద్దు’’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ స్పీచ్ ను ముగించారు.

ఇక ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ తరుపున నామినేషన్‌ దాఖలు చేసిన సభ్యుల విషయానికి వస్తే..

ప్రకారాజ్‌ ప్యానల్‌ సభ్యుల లిస్ట్ వీరే.

1. ప్ర‌కాశ్‌ రాజ్‌
2. జ‌య‌సుధ‌
3. శ్రీకాంత్‌
4. బెన‌ర్జీ
5. సాయికుమార్‌
6. తనీష్‌
7. ప్ర‌గ‌తి
8. అన‌సూయ‌
9. స‌న
10. అనిత చౌద‌రి
11. సుధ‌
12. అజ‌య్‌
13. నాగినీడు
14. బ్ర‌హ్మాజీ
15. ర‌విప్ర‌కాష్‌
16. స‌మీర్‌
17. ఉత్తేజ్
18. బండ్ల గణేష్
19. ఏడిద శ్రీరామ్‌
20. శివారెడ్డి
21. భూపాల్‌
22. టార్జ‌ాన్‌
23. సురేష్ కొండేటి
24. ఖ‌య్యుం
25. సుడిగాలి సుధీర్
26. గోవింద‌రావు
27. శ్రీధ‌ర్‌రావు

ఇక మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా నటుడు సీవీఎల్ నర్సింహారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక రేపు మంచు విష్ణు తన ప్యానెల్‌ సభ్యులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper