Prakash Raj : వెంకీకి నాన్న, జయసుధకు భర్త అయిన ప్రకాష్ రాజ్ వయసులో వాళ్ళ కంటే ఎంత చిన్నోడో తెలుసా!

విచిత్రం ఏమిటంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుమూవీలో ప్రకాష్ రాజ్ కొడుకు పాత్ర చేసిన వెంకటేష్ కూడా ప్రకాష్ రాజ్ కంటే వయసులో పెద్దవాడు. వెంకటేష్ వయసు 64 ఏళ్ళు. దాదాపు ప్రకాష్ రాజ్ కంటే ఆరేళ్ళు పెద్దవాడు.

Written By: Shiva, Updated On : April 30, 2023 12:21 pm
Follow us on

Prakash Raj : తమకంటే పెద్ద నటులకు తండ్రిగా, అన్నయ్యగా, అమ్మగా, వదిన, అక్కగా చేయడం వెరీ కామన్. ఇది చాలా కాలంగా జరుగుతుంది.  ఎన్టీఆర్,ఏఎన్నార్ ల కంటే వయసులో చిన్నవాడైన గుమ్మడి వారికి తండ్రిగా పదుల సంఖ్యలో చేశారు. అంజలి మొదట్లో ఎన్టీఆర్ కి జంటగా నటించారు. తర్వాత ఆయన తల్లి పాత్రల్లో కనిపించారు. చెప్పుకుంటూ పోతే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఈ జెనరేషన్ లో తండ్రి పాత్రలకు ప్రకాష్ రాజ్ బాగా ఫేమస్. అప్ కోర్స్ ఆయన అన్ని రకాల పాత్రలు చేశారు. టాలెంటెడ్ యాక్టర్ గా కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్… ఇలా అన్ని పాత్రలు చేశారు. 

గమ్మత్తు ఏంటంటే ప్రకాష్ రాజ్ కూడా గుమ్మడి మాదిరి తన కంటే వయసులో పెద్దవాళ్లకు తండ్రిగా, భర్తగా నటించారు. జయసుధ వయసులో ఆయన కంటే చాలా పెద్దవారు. వీరిద్దరీ హిట్ కాంబినేషన్. అనేక చిత్రాల్లో భార్యాభర్తల పాత్రలు చేశారు బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం,  శతమానం భవతి ఇలా అనేక హిట్ చిత్రాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వయసు 58 కాగా, జయసుధ వయసు 64 ఏళ్లు. 
 
వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా ఉంది. ఈ చిత్రంలో రేలంగి మామయ్యగా ప్రకాష్ రాజ్ అద్భుత నటన కనబరిచారు. విచిత్రం ఏమిటంటే ఈ మూవీలో ప్రకాష్ రాజ్ కొడుకు పాత్ర చేసిన వెంకటేష్ కూడా ప్రకాష్ రాజ్ కంటే వయసులో పెద్దవాడు. వెంకటేష్ వయసు 64 ఏళ్ళు. దాదాపు ప్రకాష్ రాజ్ కంటే ఆరేళ్ళు పెద్దవాడు. 
 
ఈ విషయాన్ని బయటకు తీసిన పలువురు కామెడీ మీమ్స్ చేస్తున్నారు. 2013లో విడుదలైన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు ప్రేక్షకుల ఫెవరేట్ మూవీగా నిలిచిపోయింది. చిన్నోడు పెద్దోడు పాత్రల్లో మహేష్ బాబు, వెంకటేష్ అద్భుతంగా చేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నిలిచింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. ఈ చిత్రం తర్వాత మహేష్ తో ఆయన చేసిన బ్రహ్మోత్సవం ప్లాప్ అయ్యింది.