JEE Main Topper : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(జేఈఈ) మెయిన్స్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. భారతదేశంలోని 43 మందిలో 11 మంది పరిపూర్ణ 100 మార్కులు సాధించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం సెషన్ 1, సెషన్ 2 సంయుక్త ఫలితాలను ప్రకటించింది. తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో టాపర్లు ఉన్నారు. ఆల్ ఇండియా నంబర్ వన్ ర్యాంక్ పొందిన సింగరాజు వెంకట్ కౌడిన్య తెలంగాణ బిడ్డే. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రోజుకు 12 గంటలు కష్టపడ్డాడని తెలిపాడు.
నలుగురికి 100 మార్కులు..
జనవరిలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ తొలి సెషన్‌లో రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులు 100 స్కోర్ సాధించారు.
సింగరాజు వెంకట్ కౌడిన్య, వావిలాల చిద్విలాస్‌రెడ్డి, అల్లం సుజయ్, బిక్కిన అభివ చౌదరి, గుత్తికొండ అభిరామ్, భరద్వాజ్, కౌసిక్‌రెడ్డి, రమేష్, సూర్యతేజ, నందిపాటి సాయి దుర్గారెడ్డి, అభినీత్ మెజెటి, ఏవూరి శ్రీధర్‌రెడ్డి తెలంగాణ నుంచి టాపర్లుగా ఉన్నారు. ఇప్పుడు, ఈ విద్యార్థులు జూన్ 4న నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సాధించడానికి సిద్ధమవుతుఆన్నరు. తాజా ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కూడా 100 స్కోరును పూర్తి చేశారు.
కౌడిన్య కుటుంబం హర్షం..
వెంకట్ సాధించిన ఘనతపై ఆయన కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఐటి ప్రొఫెషనల్ అయిన వెంకట్ తండ్రి ఫణి సింగరాజు మాట్లాడుతూ తన కొడుకును చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా రాణిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. వెంకట్ ముంబయ్ ఐఐటీలో చదివి కంప్యూటర్ సైన్స్‌లో చేరాలని ఆకాంక్షించారు.
ఎలైట్ జాబితాలో దోమల్‌గూడ విద్యార్థి..
ఇక దోమల్‌గూడకు చెందిన తోట రిథ్విక్ ఈ ఏడాది ఎలైట్ జాబితాలో చేరిన తెలంగాణకు చెందిన మరో విద్యార్థి. 44వ ర్యాంక్ సాధించిన రిత్విక్ ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నాడు. తాను సాధారణంగా 8–9 గంటలు చదువుతాను. 45 నిమిషాల–అధ్యయన పద్ధతిని చేయడమే కాకుండా, జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం మరింత కష్టపడతానని పేర్కొన్నాడు. ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని భావిస్తున్నట్లు రిత్విక్ తెలిపాడు.
సిద్దిపేట విద్యార్థికి 63వ ర్యాంకు..
సిద్దిపేటకు చెందిన మలపాణి తుషార్ జేఈఈ మెయిన్స్‌లో
ఆలిండియా 63వ ర్యాంక్ సాధించింది. దీంతో అతని తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తుషార్ తండ్రి వేణుగోపాల్ బట్టల వ్యాపారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో అతను చాలా కష్టపడి పనిచేసినందున అతను సమర్థుడని తెలుసన్నారు. అయితే 100 కంటే తక్కువ ర్యాంక్ వస్తాయని ఊహించలేదని తెలిపారు.