https://oktelugu.com/

Samantha Expensive Things : సమంత వాడే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ సహా వస్తువుల ధరలు చూస్తే కళ్లు తిరుగుతాయి.. ఎన్ని లక్షలంటే?

సమంత వద్ద అత్యంత ఖరీదైన కొన్ని వస్తువులు ఉన్నాయట. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందామా..

Written By:
  • NARESH
  • , Updated On : April 30, 2023 / 12:14 PM IST
    Follow us on

    Samantha Expensive Things : ఇప్పుడున్న అట్రాక్షన్ హీరోయిన్ల గురించి చెప్పాలంటే ముందుగా సమంత పేరే గుర్తుకు వస్తుంది. ఆమె గురించి ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతోంది. భర్త నుంచి విడిపోయిన తరువాత సమంత మరింత ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఏదో ఒకవిషయంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆమె నటించిన సినిమాలు సక్సెస్ కాకపోయినా సమంతకు మాత్రం స్పెషల్ ఇమేజ్ వస్తోంది. ఈ తరుణంలో ఆమె పర్సనల్ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. సమంత వద్ద అత్యంత ఖరీదైన కొన్ని వస్తువులు ఉన్నాయట. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని అంటున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందామా..

    చెప్పులు లక్ష..
    ఫేమస్ అయిన వారు ఏ వస్తువైనా కాస్ట్లీవే కొంటారు. సమంత చెప్పులు కూడా ఖరీదైనవే వాడుతారు. మలానో బ్లహనిక్స్ అనే బ్రాండ్ కు చెందిన వీటి ధర సుమారు లక్ష ఉంటుందని అంచనా. వీటి స్పెషల్ ఎంటో తెలియదు గానీ బ్రాండ్ మాత్రం అన్నింటికంటే నెంబర్ వన్ అని తెలుస్తోంది.

    హ్యాండ్ బ్యాగ్ లక్షన్నర..
    సాధారణంగా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మహా అయితే రూ.2000 వరకు ఉంటుంది. కానీ సమంత మాత్రం రూ.1.50 లక్షల విలువ చేసే బ్యాగ్ ను చేతికి వేసుకుంటారు. ఇది ‘గుస్సీ’ కంపెనికి చెందిన బ్యాగ్. దీనిని చాలా కొద్దిమంది మాత్రమే వాడుతారట. ఇదే కాకుండా రూ.2.5 లక్షల మరో బ్యాగ్ కూడా ఉందట.

    సొంత బ్రాండ్ డ్రెస్సులే..
    సమంతకు సొంతంగా సాకీ వరల్డ్ అనే బ్రాండ్ డ్రెస్సుల షోరూం ఉంది. సమంత వీటినే ఎక్కువగా ధరిస్తారు. ఇవి చాలా ఖరీదైనవిగా చెప్పుకుంటారు.

    రూ.15 కోట్ల ఇల్లు..
    సమంత విడాకులు తీసుకున్న తరువాత నివసించడానికి ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసింది. అయితే ఈ ఇల్లు పుట్టినిల్లు కేరళ, మెట్టినిల్లు హైదరాబాద్లో కాదు. ముంబైలో. సముద్రపు ఒడ్డున ధనవంతులు ఉండే ఏరియాలో ఓ భవనాన్ని కొనుగోలు చేసింది. దీని ఖరీదు అక్షరాల రూ.15 కోట్లు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో సమంత ఇప్పటికే సోషల్ మీడియా వీక్షకులకు చూపించింది. అయితే హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోనూ ఓ భవనం ఉన్నట్లు సమాచారం

    ఇవే కాకుండా ఆమె కారు, చేతికి వాచి తదితర వస్తువులన్నీ కాస్ట్లీవే ఉంటాయి. అందుకే సమంత నిత్యం వార్తల్లో ప్రత్యేకంగా నిలుస్తారు.