https://oktelugu.com/

అరెరే… ప్రకాష్ రాజ్ వింత పోకడ !

‘మా’ ఎన్నికలు ఎప్పుడు ? ఇది ప్రకాష్ రాజ్ సంధించిన సూటి ప్రశ్న. కాకపోతే ఎవర్నీ అడుగుతున్నాడు ? ‘జస్ట్ అస్కింగ్’ అని ట్వీట్ చేశాడు, బాగానే ఉంది. కానీ, ఆ ట్వీట్ ఎవరికీ చేశాడు ? ‘మా’ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నాడు. మరి ఎన్నికలు ఎప్పుడు పెడుతారో కూడా తెలీకుండానే ప్రకాష్ రాజ్ పోటీలోకి దిగుతున్నాడా ? ఇదెక్కడ పైత్యం ? రీసెంట్ గా తన వెంట ఒక పదిహేను మంది నటీనటులను తీసుకువచ్చి మీడియాలో […]

Written By: , Updated On : July 7, 2021 / 02:30 PM IST
Follow us on

Prakash Raj‘మా’ ఎన్నికలు ఎప్పుడు ? ఇది ప్రకాష్ రాజ్ సంధించిన సూటి ప్రశ్న. కాకపోతే ఎవర్నీ అడుగుతున్నాడు ? ‘జస్ట్ అస్కింగ్’ అని ట్వీట్ చేశాడు, బాగానే ఉంది. కానీ, ఆ ట్వీట్ ఎవరికీ చేశాడు ? ‘మా’ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నాడు. మరి ఎన్నికలు ఎప్పుడు పెడుతారో కూడా తెలీకుండానే ప్రకాష్ రాజ్ పోటీలోకి దిగుతున్నాడా ? ఇదెక్కడ పైత్యం ?

రీసెంట్ గా తన వెంట ఒక పదిహేను మంది నటీనటులను తీసుకువచ్చి మీడియాలో కూడా తెగ హడావిడి చేశాడు. మరి, ప్రకాష్ రాజ్ ఈ రోజు ట్వీట్ ఎందుకు చేసినట్టు ? మొన్నే ఒక ప్రెస్ మీట్ లో కూడా ప్రకాష్ రాజ్ మీడియా పై అబ్బో తెగ చిందులేసి నానా రచ్చ చేశాడు. తానూ ఏదో గొప్ప దేశ భక్తుడు లెవల్లో తెగ బిల్డప్ ఇచ్చాడు. అసలు ఎప్పుడో సెప్టెంబర్ లో జరిగే మా ఎన్నికలకు, మీడియా ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తోంది అంటూ క్వశ్చన్ చేశాడు.

కాకపోతే ఎప్పుడో సెప్టెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని క్లారిటీ ఉందిగా, అలాంటప్పుడు మూడు నెలలు ముందుగానే ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్టు ? పైగా ఎన్నికలు ఎప్పుడు అంటూ ఇప్పుడు కొత్తగా అడగడం ఎందుకు ? అసలు ప్రకాష్ రాజ్ కి ఈ డౌట్ ఎందుకు వచ్చింది. ఏమిటో ప్రకాష్ రాజ్. పాపం రాజకీయంగా ఎదిగే క్రమంలో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నట్లు ఉన్నాడు.

అసలు, ప్రకాష్ రాజ్ అంటేనే గర్వానికి అహానికి మధ్య వారధి అంటుంటారు. అలాంటి ప్రకాష్ రాజ్ అంటే ఎవ్వరికి నచ్చదు. అలాగే ప్రకాష్ రాజ్ విలువు లేని వ్యక్తి అని కూడా చాలామందికి ఉన్న బలమైన అభిప్రాయం. నిజానికి ప్రకాష్ రాజ్ ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. ఎందరికో సాయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు.

మరెందుకు ప్రకాష్ రాజ్ అంటే చిన్న నటీనటులు ఎవరికీ నచ్చడం లేదు ? కారణం ఒక్కటే కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ సెట్ లో చిన్న నటీనటులను అసలు గౌరవించరు. పైగా వారిని పురుగులను చూసినట్టు చూస్తాడు.