రేవంత్ రెడ్డి రాకతో కార్యకర్తల్లో జోష్

కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం శ్రేణుల్లో నూతనోత్తేజం పెల్లుబికింది. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వారిలోని ఉత్సాహాన్ని చూపించారు. నిన్నటి దాకా కామ్ గా ఉన్న పార్టీ ప్రస్తుతం రంకెలేస్తోంది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాల్సిందేనని శపథం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క అని తెగేసి చెబుతున్నారు. రేవంత్ క్రేజీ ఇప్పుడు రెట్టింపయింది. కాంగ్రెస్ శ్రేణుుల తగ్గేదేలే […]

Written By: Sekhar Katiki, Updated On : July 7, 2021 2:45 pm
Follow us on

కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం శ్రేణుల్లో నూతనోత్తేజం పెల్లుబికింది. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి వారిలోని ఉత్సాహాన్ని చూపించారు. నిన్నటి దాకా కామ్ గా ఉన్న పార్టీ ప్రస్తుతం రంకెలేస్తోంది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాల్సిందేనని శపథం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఇంకో లెక్క అని తెగేసి చెబుతున్నారు. రేవంత్ క్రేజీ ఇప్పుడు రెట్టింపయింది. కాంగ్రెస్ శ్రేణుుల తగ్గేదేలే అని చెబుతున్నాయి.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార వేళ ఆంధ్రప్రదేశ్ లోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమానులు తమ భక్తిని చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రేవంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్లెక్సీలకు అనుమతులు లేవనే కారణంతో మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీవి అయితే చూసీచూడనట్లుగా వ్యవహరించే అధికారులు కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించడం సముచితం కాదని సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దీటైన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజకీయాలు మారిపోతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి తన పునర్వైభవాన్ని తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎధుగుతారని జోస్యం చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో యువతలో దూకుడు పెరిగిందన్నారు.

రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లిలోని దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యకర్తలనుద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అందరిని కలుపుకుని పోవాతామని చెప్పారు. తన మాటల ద్వారా కార్యకర్తలకు సంకేతాలు పంపించారు.