https://oktelugu.com/

అప్పుడు వచ్చే సుఖమే వేరు: ‘ప్రగ్యా జైస్వాల్’

క్రేజీ హీరోయిన్ గా మారలేక పోయానే అనే బాధతో ఎప్పుడు లోలోపల కుమిలిపోతూ ఉంటుందట ‘ప్రగ్యా జైస్వాల్’. పాపం చివరకు బాలయ్య సినిమాలో తాను హీరోయిన్ గా నటించాల్సి రావడం ‘నా బ్యాడ్ లక్’ అంటూ ఈ మధ్య ఓ పార్టీలో నోరు జారింది. ఆ మాటలు ఎలాగోలా బాలయ్య చెవిని చేరడం, బాలయ్య ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి. మరి, ఆ చేదు సంఘటనను మర్చిపోవడానికో లేక తనకు ఈ సమయంలో మంచి […]

Written By:
  • admin
  • , Updated On : July 14, 2021 1:01 pm
    Follow us on

    Pragya Jaiswal about Datingక్రేజీ హీరోయిన్ గా మారలేక పోయానే అనే బాధతో ఎప్పుడు లోలోపల కుమిలిపోతూ ఉంటుందట ‘ప్రగ్యా జైస్వాల్’. పాపం చివరకు బాలయ్య సినిమాలో తాను హీరోయిన్ గా నటించాల్సి రావడం ‘నా బ్యాడ్ లక్’ అంటూ ఈ మధ్య ఓ పార్టీలో నోరు జారింది. ఆ మాటలు ఎలాగోలా బాలయ్య చెవిని చేరడం, బాలయ్య ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా చకచకా జరిగిపోయాయి.

    మరి, ఆ చేదు సంఘటనను మర్చిపోవడానికో లేక తనకు ఈ సమయంలో మంచి పబ్లిసిటీ కావాలని ఆశ పడిందో గానీ, మొత్తానికి ప్రగ్యా తన డేటింగ్ కబుర్లను విప్పింది. ఇంతకీ ఏమి విప్పింది అంటే.. హిట్ అవ్వకముందే ఫేడ్ అవుట్ అయిన ఈ భామ, ఎవరితోనైనా డేటింగ్ కి వెళ్ళినప్పుడు మొదటిరోజే అతగాడు ఈమెను ముద్దు అడిగితే అసలు ఒప్పుకోలేదట.

    ముందు ముచ్చట, ఆ తర్వాతే ముద్దు అంటూ చెప్పుకొచ్చింది. అసలు ఈ భామ ఉద్దేశ్యం ఏమిటంటే.. తానూ డేటింగ్ వెళ్లే వ్యక్తి గురించి అర్థం చేసుకోవాలట. ముందుగా ఒకరికి ఒకరు కొద్దిగా అర్థమై, ఆ తర్వాత మనసులు కలిసి.. ఇక అప్పుడు పెదవులు కలిపితే వచ్చే ఆ సుఖమే వేరు అంటూ సిగ్గు పడుతూ చెప్పింది. మొత్తానికి ప్రగ్యా దగ్గర డేటింగ్ సూత్రాలు చాలానే ఉన్నాయి.

    మరి ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎంతమంది తో డేటింగ్ చేసిందో.. అలాగే ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేస్తోందో ? లాంటి విషయాల గురించి మాత్రం చెప్పలేదు. అయితే ప్రగ్యా జైస్వాల్ గతంలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా ఉంది. ఆ డైరెక్టర్ కి భార్యతో వచ్చిన గొడవల సమయంలో కూడా ప్రగ్యా ఆ దర్శకుడ్ని బాగా ఓదార్చింది.

    కాకపోతే ఆ తర్వాత ఓ హిందీ నటుడితో సీక్రెట్ గా కొన్నాళ్లపాటు ప్రేమాయణం నడిపింది. ప్రస్తుతానికి ఏ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేవు. ఒక్క బాలయ్య సరసన ‘అఖండ’ సినిమాలో మాత్రం హీరోయిన్ గా నటిస్తోంది.