ప్ర‌పంచ కుబేరుడు ఆయ‌నే.. ఫోర్బ్స్ జాబితా విడుద‌ల‌

ప్ర‌తి మ‌నిషికీ ఒక ల‌క్ష్యం ఉంటుంది. అయితే.. మెజారిటీ జ‌నానికి ఉండే గోల్ మాత్రం డ‌బ్బు సంపాదించ‌డం. ఎంత సంపాదించాలి? ఎందుకు సంపాదించాలి? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త ఉన్న‌వారు అతి కొద్ది మాత్ర‌మే. ‘‘మిగిలిన వారంతా రేపు ఏదైనా పెద్ద అవ‌స‌రం వ‌స్తే ఎలా?’’ అనే భయంతో సాధ్య‌మైనంత ఎక్కువ‌గా కూడ‌బెట్టే పాల‌సీతో ముందుకు సాగుతుంటారు. ఇదంతా అవ‌సరాల్లో ఉన్న‌వారు చేసే ప‌ని. కానీ.. అది తీరిన వారు మాత్రం స‌మాజంలో గౌర‌వం, హోదా చూపించుకోవ‌డం కోసం […]

Written By: Bhaskar, Updated On : July 14, 2021 1:09 pm
Follow us on

ప్ర‌తి మ‌నిషికీ ఒక ల‌క్ష్యం ఉంటుంది. అయితే.. మెజారిటీ జ‌నానికి ఉండే గోల్ మాత్రం డ‌బ్బు సంపాదించ‌డం. ఎంత సంపాదించాలి? ఎందుకు సంపాదించాలి? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త ఉన్న‌వారు అతి కొద్ది మాత్ర‌మే. ‘‘మిగిలిన వారంతా రేపు ఏదైనా పెద్ద అవ‌స‌రం వ‌స్తే ఎలా?’’ అనే భయంతో సాధ్య‌మైనంత ఎక్కువ‌గా కూడ‌బెట్టే పాల‌సీతో ముందుకు సాగుతుంటారు. ఇదంతా అవ‌సరాల్లో ఉన్న‌వారు చేసే ప‌ని.

కానీ.. అది తీరిన వారు మాత్రం స‌మాజంలో గౌర‌వం, హోదా చూపించుకోవ‌డం కోసం సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. దానికి హ‌ద్దు లేదు. అంతం లేదు. ప్ర‌పంచంలో ఉన్న‌వారిక‌న్నా ఎక్కువ సంపాదిస్తే స‌రి.. అప్పుడు ‘‘నేనే గొప్ప‌’’ అని చెప్పుకోవచ్చు. ఈ గొప్ప‌ల కోసం ఆరాట‌ప‌డుతూ ఊహ‌కంద‌నంత డ‌బ్బు సంపాదిస్తూ ఉంటారు. ఈ క్ర‌మంలో.. ఒక సంవ‌త్స‌రం కొంద‌రు ఎక్కువ సంపాదిస్తే.. మ‌రో సంవ‌త్స‌రం ఇంకొక‌రు అధిగ‌మిస్తారు. ఈ జారుడు బ‌ల్ల‌ల కార్య‌క్ర‌మం నిత్య‌కృత్యం. ఇలా.. ఈ ఏడాది ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా సంపాదించిన వారికి సంబంధించిన జాబితాను ఫోర్బ్స్ రిలీజ్ చేసింది.

ఈ జాబితా ప్ర‌కారం.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడిగా అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బెజోస్ నిలిచారు. త‌ద్వారా.. త‌న స్థానాన్ని మ‌రోసారి నిల‌బెట్టుకున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్ర‌కారం.. ఆయ‌న ప్ర‌స్తుత సంప‌ద విలువ‌ 212.4 బిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లుగా ఉంది.

ఆ త‌ర్వాత రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ అత‌ని ఫ్యామిలీ నిలిచింది. ఎల్‌వీఎమ్‌హెచ్ కంపెనీని నిర్వ‌హిస్తున్న ఈయ‌న సంప‌ద 190.9 బిలియ‌న్ డాల‌ర్లు. ఆ త‌ర్వాత మూడో స్థానంలో ఉన్నారు ప్ర‌ఖ్యాత ఎల‌క్ట్రిక్ కార్ల దిగ్గ‌జం టెస్లా అధినేత ఎల‌న్ మ‌స్క్. ఈయ‌న సంప‌ద 168.7 బిలియ‌న్ డాల‌ర్లుగా ఫోర్బ్స్ జాబితా తేల్చింది.

ఆ త‌ర్వాత నాలుగో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ నిలిచారు. ఈయ‌న సంప‌ద‌ 129.1 బిలియ‌న్ డాల‌ర్లుగా నిర్ధారించింది. అయితే.. భార్య‌తో విడాకులు తీసుకున్న నేప‌థ్యంలో పంప‌కాలు జ‌రిగితే.. ఇందులో చాలా వ‌ర‌కు కోత ప‌డుతుంద‌ని అంటున్నారు.

ఐదో స్థానంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ నిలిచారు. ఈయ‌న సంప‌ద 127.1 బిలియ‌న్ డాల‌ర్లు. ఆ త‌ర్వాత ఒరాకిల్ కంపెనీని నిర్వ‌హిస్తున్న‌ ల్యారీ ఎలిస‌న్ ఆరో స్థానంలో నిలిచారు. ఈయ‌న ఆస్తి మొత్తం 112.5 బిలియ‌న్ డార్లుగా ఉంది. ఏడో స్థానంలో గూగుల్ వ్య‌వ‌స్థాప‌కుడు ల్యారీ పేజ్ ఉన్నారు.

106.8 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నారు గూగుల్ కంపెనీకి చెందిన‌ స‌ర్గే బ్రిన్. ఆ త‌ర్వాత తొమ్మిదో స్థానంలో ప్ర‌ముఖ షేర్ మార్కెట్ బిజినెస్ మెన్ వారెన్ బ‌ఫెట్ నిలిచారు. ఈయ‌న ఆస్తి 101.5 బిలియ‌న్ డాల‌ర్లు. లోరియ‌ల్ కంపెనీకి చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేర్స్ 87.9 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ప‌దో స్థానంలో ఉన్నారు.