Pragya Jaiswal: మద్యం తాగడం మన రాష్ట్రంలో మామూలే. మద్యం బాటిళ్లపైనే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పి మరీ అమ్ముతున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మిట్లే మందు తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని చెబుతూనే అమ్మడం విచిత్రమే. ఎవరైనా కోర్టుకు వెళితే మేం వద్దని చెబుతున్నాం. కానీ మా వ్యాపారం కోసం అమ్ముతున్నాం అని చెప్పేందుకేు. దీంతో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సర్కారుకు ఆదాయం ఎడాపెడా వస్తోంది.

మన సినిమా తారలు కూడా మద్యం బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది మద్యం ఉత్పత్తుల్ని ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోలు కూడా లిక్కర్ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రగ్యా జైశ్వాల్ కూడా చేరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అఖండ సినిమాతో హిట్ సాధించిన హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆమె లిక్కర్ బ్రాండ్ కు ప్రచారం చేయడం ప్రాధాన్యం సంతరించకుంది.
Also Read: AP New Cabinet: జగన్ కేబినెట్ లో కొత్త మంత్రులు వీరే.. రాజ్ భవన్ కు జాబితా
చివరకు మద్యం బ్రాండ్లకు కూడా ప్రచారం నిర్వహించడంతో తారలపై అసంతృప్తి పెరుగుతోంది. వీరికి ఏం తక్కువైందని మద్యం బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అల్కహాల్ తో కుటుంబాలే అతలాకుతలం అవుతుంటే వీరు మద్యం తాగాలని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. మద్యం బ్రాండ్ కు ప్రచారం చేస్తూనే పైగా నీతులు వల్లెవేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాగమని చెబుతూనే పాతికేళ్లు దాటిన కుర్రాళ్లు మాత్రమే అంటూ నీతి వాక్యాలు చెబుతుంటే అందరికి ఆగ్రహం తెప్పించింది. మద్యం కోసం ప్రచారం చేస్తూ కోట్లకు కోట్లు తీసుకుంటూ మళ్లీ నీతులెందుకని ప్రశ్నిస్తున్నారు. మద్యం బ్రాండ్లు ప్రచారం చేసిన వారిలో పూజా హెగ్డే నుంచి లక్ష్మీరాయ్, హన్సిక, రాధిక ఆప్టే, పాయల్ రాజ్ పుత్, ఇలియానా, కాజల్ వంటి హీరోయిన్లు ప్రచారకర్తలుగా చేసి డబ్బు సంపాదించుకున్నారు. కానీ వారి గురించి ఎవరు కూడా కోపం వ్యక్తం చేయకపోయినా జైశ్వాల్ గురించి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read:IPL 2022 CSK: ఐపీఎల్ లో చెన్నై ఓటమికి ప్రధాన కారణం ఈ రెండేనట!