https://oktelugu.com/

Actress Pragathi: వామ్మో నటి ప్రగతి ఫోటో చూశారా? వైరల్ పిక్స్

ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటుంది ప్రగతి. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 29, 2024 / 03:27 PM IST

    Actress Pragathi

    Follow us on

    Actress Pragathi: తను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఈమె కెమెరా ముందు ఉంటే ఏడిపించడంలో, నవ్వించడంలో, ఎమోషన్ పండించడంలో సూపర్ అంటారు.ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ప్రగతి ఎన్నో సంవత్సరాలుగా నటిస్తోంది. తెలుగు, తమిళ్ లో దాదాపు 150కి పైగా సినిమాల్లో అమ్మ, అత్త.. వంటి పాత్రలు వేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. మొత్తం మీద తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రగతి. మరి ఈ అత్త 25 ఏళ్ల సంవత్సరాల వయసులో ఎలా ఉండేదో తెలుసా?

    ఇటీవల అడపాదడపా సినిమాలు చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటుంది ప్రగతి. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. ఆల్మోస్ట్ రోజుకి ఓ 8 గంటలు జిమ్ లోనే గడిపేస్తుంటుంది. ఇటీవల కొన్నాళ్ల క్రితం జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ లో ప్రగతి పాల్గొని రజత పతకం కూడా సాధించింది.

    ప్రస్తుతం సినిమాల కంటే కూడా పవర్ లిఫ్టింగ్ మీదే ఫోకస్ చేస్తున్నట్టుంది ప్రగతి. గతంలో చాలా సార్లు జిమ్ లో ప్రగతి వర్కౌట్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నటి ప్రగతి సోషల్ మీడియాలో తన 25వ ఏట ఎలా ఉండేదో ఫోటో షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తను 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నానో చూడండి అంటూ ఓ ఫోటో అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటో చుసిన నెటిజన్లు ప్రగతి చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    ఈమెకు 48 సంవత్సరాలు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం పిల్లలతోనే కలిసి ఉంటుంది ప్రగతి. మొత్తం మీద ఈ అమ్మడు 25 ఏళ్ళ వయసులో హాట్ లుక్ లో కనిపిస్తుంది కదా. అప్పుడు ఈ అమ్మడు యూత్ ఫేవరేట్ కావచ్చు కదా.