Homeఎంటర్టైన్మెంట్Dacoit Movie Collections: 'డెకాయిట్' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఈ రేంజ్ బాక్స్...

Dacoit Movie Collections: ‘డెకాయిట్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ఊహించలేదు..

Dacoit Movie Collections: ప్రస్తుత జనరేషన్ లో ఒక సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావాలంటే , ఆడియన్స్ లో సరైన అంచనాలను ఏర్పాటు చేసే కంటెంట్ ని విడుదల చెయ్యాలి, విడుదల తర్వాత టాక్ వచ్చినా జనాలు ఈమధ్య కదలడం లేదు , విడుదలకు ముందు క్రియేట్ అయ్యే బజ్ మీదనే ప్రస్తుతం ఒక సినిమా భవిష్యత్తు నిర్ణయం అవుతోంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాకు అయినా విడుదలకు ముందు బజ్ క్రియేట్ అవ్వాల్సిందే, లేదంటే ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. అది ఏకంగా గత నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకే చూశాం. ఆ చిత్రానికి ముందు 5 నెలల క్రితమే ఓజీ తో ఆయన క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ సునామీ ఎలాంటిదో మన కళ్లారా చూశాం. ఇంత తక్కువ గ్యాప్ లో మళ్లీ ఆయన సినిమాకు తక్కువ ఓపెనింగ్ రావడమంటే , ప్రీ రిలీజ్ బజ్ ఎంత కీలకం అనేది అర్థం చేసుకోవచ్చు.

విడుదలకు ముందు మంచి బజ్ ఉంటే, ఎంత చిన్న హీరోకి అయినా భారీ ఓపెనింగ్ వస్తుంది అనడానికి అడివి శేష్ మరో ఉదాహరణగా నిలిచాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’ మంచి అంచనాల నడుమ విడుదలైంది. అడివి శేష్ సినిమాలంటే ఆడియన్స్ లో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఆయన సినిమాల్లో ఉండే కంటెంట్ అద్భుతంగా ఉంటుందని, ఊహించని ట్విస్టులతో థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తాడని బలమైన నమ్మకం ఉండడంతో , ఈ చిత్రానికి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి, ఇక విడుదల తర్వాత కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ లో ఎలాంటి డ్రాప్స్ రాలేదు. మొదటి రోజు బుక్ మై షో యాప్ లో 1 లక్షా 51 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా , రెండవ రోజున 1 లక్షా 48 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , తెలంగాణ ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 85 లక్షలు, కర్ణాటక నుండి 1 కోటి 90 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 60 లక్షలు, ఓవర్సీస్ నుండి 9 కోట్ల రాయిపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రానికి 21 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ లో అయితే రెండు రోజులకు కలిపి 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు రోజుల్లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular