LIK Movie Day 2 Collections: వరుస ఫెయిల్యూర్స్ తో డీలాపడిన టాలీవుడ్ కి నిన్న విడుదలైన ‘డెకాయిట్’, ‘LIK ‘ చిత్రాలు కొత్త ఊపిరి పోస్తాయని అంతా అనుకున్నారు, కానీ ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది. ఎవ్వరూ అట్టర్ ఫ్లాప్ అని చెప్పలేదు కానీ , కొంతమంది బాగుందని, మరికొంతమంది యావరేజ్ రేంజ్ లో ఉందని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మొదటి రోజు ఈ రెండు చిత్రాలకు మంచి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే రెండవ రోజు నుండి ‘డెకాయిట్’ చిత్రం వన్ సైడ్ డామినేషన్ చూపిస్తుంది , వీకెండ్ లో ఆ చిత్రమిదే పై చెయ్యి అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి అలా లేదు, రెండవ రోజున ‘LIK ‘ చిత్రం డామినేషన్ చూపించడం మొదలు పెట్టింది. తెలుగు వెర్షన్ నుండి ఈ చిత్రానికి మినిమం గ్యారంటీ రేంజ్ వసూళ్లు కూడా నమోదు అవ్వడం లేదు.
కానీ తమిళ వెర్షన్ నుండి మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి రోజు ఈ చిత్రానికి తమిళనాడు ప్రాంతం నుండి 6 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి , కానీ రెండవ రోజున ఈ చిత్రానికి కచ్చితంగా 6.4 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక డెకాయిట్ విషయానికి వస్తే , మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రెండవ రోజు కూడా అదే రేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా చూస్తే ‘డెకాయిట్’ కంటే ‘LIK’ చిత్రానికే నేడు ఎక్కువ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బుక్ మై షో యాప్ లో కూడా ‘LIK’ డామినేషన్ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఈ చిత్రానికి గంటకు 9 నుండి 10 వేల టిక్కెట్లు అమ్ముడుపోతుంటే, ‘డెకాయిట్’ చిత్రానికి గంటకు 8 నుండి 9 వేల మధ్యలో టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఈ రెండు సినిమాల్లో నేడు టికెట్స్ సేల్స్ పరంగా, గ్రాస్ వసూళ్ల పరంగా డొమెస్టిక్ మార్కెట్ LIK దే పైచెయ్యి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఓవర్సీస్ లో మాత్రం ‘డెకాయిట్’ చిత్రం ‘LIK ‘ పై భారీ రేంజ్ మార్జిన్ తో ఆధిపత్యం చూపిస్తోంది. మరి ఫుల్ రన్ లో ఈ రెండు సినిమాల్లో దేనికి ఎక్కువ వసూళ్లు నమోదు అవుతాయి అనేది చూడాలి.