Homeఎంటర్టైన్మెంట్Chitram Seenu viral video: సగం మణికొండ ని కొనేంత డబ్బులు సంపాదించిన స్టార్ కమెడియన్.....

Chitram Seenu viral video: సగం మణికొండ ని కొనేంత డబ్బులు సంపాదించిన స్టార్ కమెడియన్.. వీడియో వైరల్..

Chitram Seenu viral video: ఒకప్పుడు కింగ్ లాగా బ్రతికిన ఎంతో మంది స్టార్ నటులు , నేడు సినిమాల్లో అవకాశాల్లో లేక, ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ కమెడియన్ చిత్రం శీను. ఒకప్పుడు ఈయన ఏ రేంజ్ బిజీ కమెడియన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడాదికి కనీసం 10 నుండి 15 సినిమాల్లో నటించేవాడు. ఇప్పటికీ ఆయన సినిమాలు […]

Chitram Seenu viral video: ఒకప్పుడు కింగ్ లాగా బ్రతికిన ఎంతో మంది స్టార్ నటులు , నేడు సినిమాల్లో అవకాశాల్లో లేక, ఆర్థికంగా కూడా బాగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వచ్చిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ కమెడియన్ చిత్రం శీను. ఒకప్పుడు ఈయన ఏ రేంజ్ బిజీ కమెడియన్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఏడాదికి కనీసం 10 నుండి 15 సినిమాల్లో నటించేవాడు. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ , ఒకప్పటి ఊపు అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం ఆయన ఒకటి లేదా రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒకడై , లక్షలకు లక్షలు సంపాదిస్తూ , ముందుకు దూసుకెళ్లిన చిత్రం శ్రీను , నేడు ఇలా ఎందుకు అయ్యాడో , ఆరోజుల్లో డబ్బులను ఎలా వృధా చేసాడో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాకు రాజీవ్ కనకాల బాగా పరిచయం. మేమిద్దరం బావ బావ అని పిలుచుకుంటూ ఉంటాము. ఒక రోజు ఒకచోట ల్యాండ్ చూశాను , కొంటున్నాను , నువ్వు కూడా కుదిరితే కొనుక్కో అన్నాడు. ఎక్కడ ల్యాండ్ కొంటున్నావ్ బావ? అని అడిగాను. మణికొండ అని చెప్పాడు. అప్పుడు నేను బావ నేను మణికొండ లో ఉండాలా?, చిరంజీవి గారు జూబ్లీ హిల్స్ లో ఉంటాడు కదా, నేను కూడా అక్కడే ఇల్లు కొంటాను అనేవాడిని. ఇప్పుడు తల్చుకుంటే ఆరోజుల్లో ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశాను అనిపిస్తుంది. ఇప్పుడు నా కెరీర్ లో చాలా బిజీ గా ఉన్నన్ని, భవిష్యత్తులో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్తాను అనే పొగరు ఆరోజుల్లో నాకు ఉండేది, అలా ఉండకూడదు అని నా అనుభవాలు నాకు నేర్పించింది’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము , కాబట్టి బాగా సంపాదించే రోజుల్లోనే డబ్బులు దాచిపెట్టుకోవాలని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు డబ్బులను అసలు లెక్క చేసేవారు కాదట , ఇష్టమొచ్చినట్టు ఖర్చులు చేసేవారట?, మీ సంపాదించిన డబ్బులతో సగం మణికొండ ని కొనేవారు అని అప్పట్లో అంటుండేవారు’ అని యాంకర్ అడగ్గా అందుకు చిత్రం శ్రీను సమాధానం చెప్తూ ‘ప్రతీ రోజు నేను 4 నుండి 5 సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొనేవాడిని , అప్పటికి ఉన్న రేటుకు నేను సగం మణికొండని కొనేసి ఉండొచ్చు, చాలా డబ్బులు వృధా చేశాను , అలా చెయ్యకూడదు , ఎప్పుడూ నేను బిజీ గా ఉంటాను , నాకు ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయని అప్పట్లో అనుకునేవాడిని, లక్ష్మి దేవి ని ఎప్పుడూ అలా తక్కువ చేయకూడదు అని అనుభవాలు నేర్పించాయి’ అంటూ చెప్పుకొచ్చాడు చిత్రం శ్రీను.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper