Prabhas vs Shah Rukh Khan: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య సినిమాల పరంగా విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకరి సినిమా రిలీజ్ అయి భారీ సక్సెస్ ని సాధించిందంటే మరొక హీరో ఆ సినిమాను మించిన సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చేస్తుంటాడు. ఇది ఎప్పటికప్పుడు అందరి హీరోల మధ్య రెగ్యూలర్ గా జరిగే పోటీ అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లోకి దూసుకెళ్లిన ప్రభాస్ అమాంతం తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. అలాగే బాలీవుడ్ హీరోల డామినేషన్ ను తగ్గించాడు. ఇక దాంతో ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా షారుక్ ఖాన్ లాంటి నటుడు ప్రభాస్ తో పోటీకి రావాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రభాస్ స్టడీగా నిలబడుతున్నాడు. గతంలో వీళ్లిద్దరి మధ్య ఒక సినిమా విషయంలో పోటీ జరిగింది.ప్రభాస్ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.
ఇక అప్పుడే షారుక్ ఖాన్ ‘డంకీ’ మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ రెండు సినిమాల మధ్య జరిగిన పోటీలో ప్రభాస్ విజయం సాధించాడు. షారుక్ ఖాన్ మాత్రం ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభాస్ ముందు షారుక్ ఖాన్ ఓడిపోయాడు.
ఇక ఇప్పుడు మరోసారి ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ సినిమా సైతం డిసెంబర్ మూడోవ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక అదే నెలలో షారుక్ ఖాన్ హీరోగా చేసిన కింగ్ సినిమా సైతం డిసెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం… ఇక మరోసారి వీళ్ళిద్దరు ఒకే నెలలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. కాబట్టి వీళ్ళలో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు డీలా పడిపోతారు అనేదానిలో సరైన క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే ఇద్దరు హీరోల అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని సోషల్ మీడియా విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే వీళ్ళలో ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారు. ఎవరు పై చేయి సాధిస్తారు. ఎవరు స్టార్ హీరోగా నిలబడిపోతారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…


