
Prabhas-‘Salaar’ : ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’.KGF సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి లీక్ అయిన ఫోటోలు , మరియు షూటింగ్ వీడియోస్ అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసాయి.KGF కి మించిన భారీ యాక్షన్ మరియు ఎలివేషన్స్ తో ఈ సినిమాని తీస్తున్నారనే విషయం ఇప్పటికే అర్థం అయిపోయింది.
అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా వచ్చిన మరో వార్త ఫ్యాన్స్ కి కిక్ ని ఇస్తుంది.అదేమిటంటే ఈ సినిమాని KGF తరహాలోనే రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట.కానీ వెంటవెంటనే కాదట, మొదటి భాగం విడుదలైన తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు.ఈ సినిమా పూర్తైన తర్వాతే సలార్ పార్ట్ 2 ఉంటుందట.ఈ వార్త ఇప్పుడే లేటెస్ట్ గా వచ్చింది.
అయితే ప్రభాస్ కి ఈ సినిమాని రెండు భాగాలుగా తియ్యడానికి ఏమాత్రం ఇష్టం లేదనే రూమర్ సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవుతుంది.ఈ కథ రెండు భాగాలుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభాస్ అభిప్రాయం, కానీ ప్రశాంత్ నీల్ మాత్రం నన్ను నమ్మండి, రెండు భాగాలుగా తీస్తేనే ఈ సినిమా వర్కౌట్ అవుతుందని ఒప్పించాడట.ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఈ మహాశివ రాత్రి సందర్భంగా 18 వ తారీఖున విడుదల చేస్తారని ఫ్యాన్స్ భావించారు,కానీ ఆ అవకాశం లేదని తెలుస్తుంది.
దీనితో ఫ్యాన్స్ కాస్త నిరాశకి గురయ్యారు.ఇది ఇలా ఉండగా ‘సలార్’ మూవీ షూటింగ్ ఈ నెలలోనే పూర్తి అవ్వబోతుందట, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది.ముందుగా ప్రకటించినట్లు గానే ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నారట.