https://oktelugu.com/

Bhola Shankar’ movie : ఫ్యాన్స్ కోసం ‘భోళా శంకర్’ లో భారీ మార్పులు.. మరో 100 కోట్లు కొట్టబోతున్న మెగాస్టార్

Bhola Shankar’ movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ఊపు తో రెట్టింపు ఉత్సాహం తో ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే..ఇటీవలే శేఖర్ మాస్టర్ ఆద్వర్యం లో ఒక సాంగ్ ని చిత్రీకరించారు.దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆ ఫొటోలన్నీ చూస్తూ ఉంటే ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ లాగానే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : February 12, 2023 / 09:05 PM IST
    Follow us on

    Bhola Shankar’ movie : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గ్రాండ్ సక్సెస్ ఇచ్చిన ఊపు తో రెట్టింపు ఉత్సాహం తో ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే..ఇటీవలే శేఖర్ మాస్టర్ ఆద్వర్యం లో ఒక సాంగ్ ని చిత్రీకరించారు.దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఆ ఫొటోలన్నీ చూస్తూ ఉంటే ఈ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ లాగానే పక్క మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న సినిమా అని అర్థం అవుతుంది.

    మెగాస్టార్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తే బాక్స్ ఆఫీస్ ఊచకోతే అని ఈ సంక్రాంతికి మరోసారి రుజువు అయ్యింది, ‘భోళా శంకర్’ కూడా అదే జానర్ లో వస్తున్న సినిమా అయ్యినప్పటికీ అభిమానులు ఆ చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ని చూసి భయపడిపోతున్నారు.ఎందుకంటే ఆయన కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ సినిమా కూడా లేదు.

    దానికి తోడు ‘భోళా శంకర్’ తమిళం లో సూపర్ హిట్టైన అజిత్ ‘వేదలమ్’ సినిమాకి రీమేక్..ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలకు మన టాలీవుడ్ ఆడియన్స్ కదలట్లేదు అనేది మన అందరం గమనించాము.అందుకు ఉదాహరణ మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ చిత్రమే.అలాంటి పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో రీమేక్ అనే నెగటివిటీ ని తట్టుకొని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెగ్గుకుని రాగలదా అని అభిమానుల సందేహం.అయితే అలాంటి సందేహాలేమి పెట్టుకోవద్దని,మెగాస్టార్ నుండి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అంశాలన్నీ ఈ చిత్రం లో కూడా ఉంటాయని, ఒరిజినల్ స్టోరీ కంటే ఎక్కువగా మాస్ ఉండేటట్టు చిరంజీవి సూచనల మేరకు మెహర్ రమేష్ ఈ సినిమా కథని చాలా చక్కగా తీర్చి దిద్దుతున్నాడని వార్తలు వచ్చాయి.

    బిజినెస్ సర్కిల్ లో కూడా ఈ టాక్ రావడం తో థియేట్రికల్ బిజినెస్ కి రికార్డు రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయని వినికిడి.ఆగష్టు 11 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ‘వాల్తేరు వీరయ్య’ లాగానే సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.