https://oktelugu.com/

‘కెజిఎఫ్’ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్

బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ క్రమంలో ఇపుడు రాబోయే చిత్రాలన్నీ తన రేంజ్ కి తగ్గ విధంగా విభిన్న దర్శకులతోనే చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇపుడు ఒక పర భాషా దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. కె జి ఎఫ్ చిత్రం తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇపుడు ప్రభాస్ తో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ […]

Written By:
  • admin
  • , Updated On : April 27, 2020 / 04:34 PM IST
    Follow us on


    బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ క్రమంలో ఇపుడు రాబోయే చిత్రాలన్నీ తన రేంజ్ కి తగ్గ విధంగా విభిన్న దర్శకులతోనే చేస్తున్నాడు. ఆ క్రమంలో ఇపుడు ఒక పర భాషా దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. కె జి ఎఫ్ చిత్రం తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకొన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇపుడు ప్రభాస్ తో చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు కూడా సిద్ధంగా ఉన్నారు.రీసెంట్ గా ధూమ్ 4 చిత్రం లో చేయమని బాలీవుడ్ నుంచి అఫర్ వస్తే ప్రభాస్ వదులు కొన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్లో ఓ ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు . .

    నిజానికి ప్రశాంత్ నీల్.. తన ” కె జి ఎఫ్ 2 ” చిత్రం పూర్తి కాగానే ..ఎన్ . టి. ఆర్ తో గాని , మహేశ్ బాబు తో గాని సినిమా చేయాలను కొన్నాడు .. కానీ ఆ ఇద్దరికి వేరే దర్శకులతో కమిట్ మెంట్ ఉండటం తో ప్రశాంత్ నీల్ ..ప్రభాస్ వైపు మొగ్గు చూపాడట …మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రభాస్ కి చాలా రోజుల క్రితం అడ్వాన్స్ ఇచ్చి వున్నారు. దాంతో వాళ్ళు ప్రశాంత్ నీల్ లైన్ లోకి రాగానే ప్రభాస్ కి కథ చెప్పించి సినిమా ఒకే చేయించారు . ప్రశాంత్ నీల్ ఇంతవరకు తీసింది. రెండే రెండు చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. `కె జి ఎఫ్ ` చిత్రానికి ముందు ప్రశాంత్ నీల్ “ఉగ్రమ్ ” అనే మూవీ తీయడం జరిగింది.అది కన్నడ నాట విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లు రాబట్టింది . ఇక తరవాత తీసిన `కె జి ఎఫ్ ‘. చిత్రం డైరక్టర్ ప్రశాంత్ నీల్ స్టామినాను ఇండియా అంతటా చాటింది .ఇపుడు ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ కి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం తప్పదు. ఆ ధైర్యం తోనే మైత్రి మూవీ మేకర్స్ ముందుకు కదులు తున్నారు .