పారిశుధ్య కార్మికులకు శేఖర్ కమ్ముల సాయం

పారిశుధ్య కార్మికులకు దర్శకుడు శేఖర్ కమ్ముల సాయమందించేందుకు ముందుకొచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నార్త్ జోన్లో పనిచేసే వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు నెలరోజులపాటు పాలు, మజ్జిగ అందించనున్నాడు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శేఖర్ కమ్ముల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. తమ ఏరియాలో ప్రతీరోజు పారిశుధ్య కార్మికులను చూస్తుంటానని.. వారంతా ఎండలో […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 4:48 pm
Follow us on


పారిశుధ్య కార్మికులకు దర్శకుడు శేఖర్ కమ్ముల సాయమందించేందుకు ముందుకొచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నార్త్ జోన్లో పనిచేసే వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు నెలరోజులపాటు పాలు, మజ్జిగ అందించనున్నాడు. ఈ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ నిర్వహించనుంది. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి శేఖర్ కమ్ముల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితులు పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. తమ ఏరియాలో ప్రతీరోజు పారిశుధ్య కార్మికులను చూస్తుంటానని.. వారంతా ఎండలో కష్టపడుతుంటారని తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తనవంతుగా వెయ్యిమంది కార్మికులకు నెలరోజులపాటు పాలు, మజ్జిగ అందించనున్నట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు దేవుళ్లతో సమానమని.. ప్రస్తుతం మనిషికి మనిషి తోడుండాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.

అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. లాక్డౌన్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని అన్నారు. కాగా కొందరిలో ఇంకా మార్పు రావాల్సి ఉందన్నారు. కరోనాకు మందులేదని.. స్వీయనియంత్రణ మార్గమని అన్నారు. కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలను కొనియాడారు. దర్శకుడు శేఖర్ కమ్ముల పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం గురించి ఆలోచించి సాయమందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల శేఖర్ కమ్ముల వంటి దర్శకులు వారిపై చూపుతున్న ప్రేమకు ధన్యావాదాలు తెలిపారు. కరోనా లాంటి అపత్కర సమయంలో ఎవరూ కూడా బయటికి రావద్దని కోరారు. కొద్దిరోజులు సంయమనం పాటిస్తే అన్ని పరిస్థితులు చక్కబడుతాయని అన్నారు.