Pithapuram Varma
Pithapuram Varma : మెగా బ్రదర్స్( Mega brothers ) వ్యవహార శైలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక రేపుతున్నాయి. సామాజిక వర్గపరంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందుల్లో నెడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో సామాజిక వర్గం ఈక్వేషన్ అధికం. తాజాగా జరిగిన పరిణామాలతో క్షత్రియ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. అది పతాక స్థాయికి చేరితే మాత్రం కూటమికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది నష్టం చేకూర్చే అంశం. అందుకే టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Also Read : మొన్న నాదెండ్ల.. నేడు పవన్.. జనసేన వల్లే టీడీపీకి అధికారమట!*
* చంద్రబాబు ఆదేశాలతోనే..
గత ఎన్నికల్లో పిఠాపురం( Pithapuram) నియోజకవర్గ టికెట్ వదులుకున్నారు వర్మ. కేవలం చంద్రబాబు ఒప్పించడంతోనే ఆయన తన టిక్కెట్ ను త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఎన్నికల వరకు అవసరమైన వర్మ.. ఫలితాలు వచ్చిన తర్వాత అవసరం లేనట్టుగా ఉండి పోవాల్సి వచ్చింది. జన సేన నుంచి అనేక రకాల అవమానాలు ఆయనకు ఎదురైన మౌనంగా భరిస్తూ వచ్చారు. నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు. ఎమ్మెల్సీగా కొంత సంతృప్తి చెందవచ్చు అని చూశారు. కానీ అటు ఎమ్మెల్సీ పదవి రాలేదు. పార్టీతో పాటు కూటమిలో గౌరవం దక్కడం లేదు.
* పిఠాపురం పై స్పష్టత
అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) పోటీ చేయనున్నారు. జనసేన ప్లీనరీ వేదికగా దీనిని ప్రకటించారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు తేనె తుట్టను కదిపారు. పవన్ గెలుపులో ఎవరూ లేరని.. అది పవన్ మాత్రమే ఉన్నారని.. పిఠాపురం ప్రజలు గెలిపించాలని చెప్పుకొచ్చారు. తద్వారా పిఠాపురం వర్మ పాత్ర లేదని తేల్చేశారు. అయితే ఇక్కడే వర్మ తీవ్ర ఆలోచనలో పడిపోతున్నారు. ఒకవైపు గౌరవం లేదు. మరోవైపు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి లేదు. ఇంకోవైపు పిఠాపురం టికెట్ పై ఆశ వదులుకోవాల్సిందే. ఇన్ని పరిణామాల నడుమ పార్టీలో ఉండడం శ్రేయస్కరమా? కాదా? అని తెగ ఆలోచన చేస్తున్నారు వర్మ. అయితే వర్మ లాంటి నేతను కాపాడుకోకపోతే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం. ఎందుకంటే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలను కాదని ఒక ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మది.
* సామాజిక వర్గాల ఈక్వేషన్స్..
మరోవైపు గోదావరి జిల్లాలు( Godavari district) అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఉంటాయని గుర్తు ఎరగాలి. ఈ విషయంలో మెగా బ్రదర్స్ కూడా ఆలోచన చేయాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి కాపులు అండగా నిలిచారు. క్షత్రియులు సైతం మద్దతు తెలిపారు. వర్మ క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే ఆ రెండు కులాలు స్వాగతించాయి. కానీ ఇప్పుడు అదే వర్మకు అన్యాయం జరుగుతుంటే మాత్రం క్షత్రియ సామాజిక వర్గం ఊరుకునే పరిస్థితిలో లేదు. పదవులు ఇవ్వలేదు సరి కదా ఆయన త్యాగాన్ని సైతం హేళనగా మాట్లాడడాన్ని క్షత్రియ సామాజిక వర్గం తట్టుకోలేకపోతోంది. ఒకవేళ వర్మ తీవ్ర ఆలోచన చేసినా.. కూటమి జేజేతులా వర్మను వదులుకున్నా క్షత్రియ సామాజిక వర్గం మాత్రం క్షమించే అవకాశం లేదు. ఇక ఆలోచించుకోవాల్సింది కూటమి పార్టీలు.. టిడిపి, జనసేన అగ్రనేతలు.
Also Read : నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ని నిలబెట్టింది మనమే – పవన్ కళ్యాణ్.