The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ పూర్తి కథ ఇదేనా..కథ మొత్తం వింటే వణికిపోతారు..డైరెక్టర్ మారుతీ లో ఇంత విషయం ఉందా?

ఈ సినిమా తర్వాత ఈ ట్రెండ్ ఊపు అందుకుంది. అలా 'రాజా సాబ్' చిత్రం కూడా 'హారర్' జానర్ లో ఇప్పటి వరకు ఆడియన్స్ చూడని కోణాన్ని పరిచయం చేయబోతున్నాడట డైరెక్టర్ మారుతి. ఇంతకీ ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటో చూద్దాం.

Written By: Vicky, Updated On : October 23, 2024 4:11 pm

The Raja Saab(2)

Follow us on

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాజా సాబ్’ మూవీ కి సంబంధించిన మోషన్ పోస్టర్ కాసేపటి క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభాస్ ని ముసలి రాజు గెటప్ లో చూసి ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. హారర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, ప్రభాస్ దెయ్యం క్యారక్టర్ కూడా చేస్తున్నట్టు ఈ మోషన్ పోస్టర్ ని చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ హారర్ థ్రిల్లర్ జానర్ లో నటించడమే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే, మళ్ళీ ఆయన దెయ్యం క్యారక్టర్ లో కూడా కనిపించడం మరో సర్ప్రైజ్. మారుతీ హారర్ జానర్ లో చాలా కొత్తగా అలోచించి సినిమాలను తీస్తాడు. వాస్తవానికి హారర్ కామెడీ జానర్ ని టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. ఆయన స్టోరీ అందించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా తర్వాత ఈ ట్రెండ్ ఊపు అందుకుంది. అలా ‘రాజా సాబ్’ చిత్రం కూడా ‘హారర్’ జానర్ లో ఇప్పటి వరకు ఆడియన్స్ చూడని కోణాన్ని పరిచయం చేయబోతున్నాడట డైరెక్టర్ మారుతి. ఇంతకీ ఈ సినిమా స్టోరీ లైన్ ఏమిటో చూద్దాం. మధ్యతరగతి కుటుంబం లో అందరి లాగానే సాధారణమైన జీవితం గడుపుతున్న ఒక కుర్రాడికి ధనవంతుడిగా బ్రతకాలి, రాజా లాగ లగ్జరీ లైఫ్ ని అనుభవించాలి వంటి కోరికలు ఉంటాయి. అలా బ్రతికేందుకే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమం లో ఆయనకీ తన తాత గారికి సంబంధించిన ఆస్తులు తన సొంత ఊరిలో ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఊరిలో తన తాత గారు నివసించే రాజ్ మహల్ లాంటి ఇల్లు, అలాగే ఆయన దాచిపెట్టిన నగలు, డబ్బులతో కూడిన బోలెడంత నిధి ఉందని, ఆ ఆస్తి మొత్తానికి అతనే వారసుడు అనే విషయాన్ని తెలుసుకొని, ఆ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడికి వెళ్లిన తర్వాత తన తాత ఆత్మ అదే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది.

ప్రతీ రోజు రాత్రులు ఆ ఆత్మ ఇంట్లోకి అడుగుపెట్టి పియానో వాయిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇంట్లోకి తన వారసుడు కాకుండా, పరాయి వాళ్ళు అడుగుపెడితే చంపేస్తూ ఉంటుంది ఆ రాజా సాబ్ ఆత్మ. ఇంతకు రాజా సాబ్ మంచి వాడా, చెడ్డవాడా?, ఎందుకు తన వారసుడిని తప్ప ఆ ఇంట్లోకి అడుగుపెట్టే అమాయకులను చంపేస్తున్నాడు, అసలు ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి?, తన వంశంలో వారసుడు(హీరో) తప్ప అందరూ ఎందుకు చనిపోయారు అనేది స్టోరీ. మూవీ స్క్రీన్ ప్లే మొత్తం ఆడియన్స్ ని ఒక పక్క భయపెడుతూనే, మరోపక్క నవ్విస్తుందట. ఇటీవల కాలం లో ఇలాంటి వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్ స్టోరీ తో సినిమాలు రాలేదని అంటున్నారు. మరి ఈ చిత్రం నిజంగానే ఆ రేంజ్ లో భయపెడుతుందా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.